తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెంచరీతో పాటే రికార్డుల్ని కొట్టేశాడు

ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికాపై సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ... తన పేరిట పలు రికార్డుల్ని నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్​లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్​గా 8 వేల పరుగులు చేసిన 7వ భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

By

Published : Jun 6, 2019, 10:35 AM IST

సెంచరీతో పాటే రికార్డుల్ని కొట్టేశాడు

ప్రపంచకప్​లో తన ప్రయాణాన్ని ఆలస్యంగా ఆరంభించినా.... ఘనంగా బోణి కొట్టింది టీమిండియా. సౌతాంఫ్టన్​ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో గెలిచింది.

సమష్టిగా రాణించిన భారత క్రికెట్ జట్టు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఓపెనర్ రోహిత శర్మ సెంచరీ చేసి తన పేరిట పలు రికార్డుల్ని నమోదు చేశాడు.

  1. వన్డే కెరీర్​లో 23వ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. సౌరవ్ గంగూలీ(22)ని దాటేశాడు. అతడి కంటే ముందు సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ ఉన్నారు.
  2. ఈ మ్యాచ్​లో 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద... అంతర్జాతీయ క్రికెట్​లో 12 వేలు పరుగులు పూర్తి చేసుకున్న 9వ భారత క్రికెటర్​గా నిలిచాడు.
    టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ
  3. ఓపెనర్​గా 8 వేలు పరుగులు పూర్తి చేసుకున్న 7వ టీమిండియా బ్యాట్స్​మన్​గా నిలిచాడు రోహిత్ శర్మ.
  4. ప్రపంచకప్​లో వరుసగా మూడు మ్యాచ్​ల్లో ఓడటం దక్షిణాఫ్రికాకు ఇదే మొదటిసారి. 1992లో వరుసగా రెండు మ్యాచ్​ల్లో ఓటమి పాలైన సఫారీలు.. 2015 వరకు మరెప్పుడూ అలా ఓడిపోలేదు.
    దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు
  5. 2015 ప్రపంచకప్​ తర్వాత వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 16వ సెంచరీ. ఇతడి కంటే ముందు 19 శతకాలతో కోహ్లీ ముందున్నాడు.

ఇది చదవండి: కోహ్లి ఫొటో పోస్ట్​ చేసిన ఐసీసీ- షాకిచ్చిన నెటిజన్లు

ABOUT THE AUTHOR

...view details