తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్​: స్మిత్​ చేతిలో ఇంజమామ్​ రికార్డు బ్రేక్​

ప్రతిష్టాత్మక యాషెస్​లో అద్భుత ప్రదర్శనతో వరుసగా రికార్డులు సృష్టిస్తున్నాడు ఆసీస్​ ఆటగాడు స్టీవ్ ​స్మిత్​. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో మరో అర్ధశతకం ఖాతాలో వేసుకున్న ఈ క్రికెటర్​... పాకిస్థాన్​ ఆటగాడు ఇంజమామ్​-ఉల్-​హక్​ పేరిట ఉన్న రికార్డు బ్రేక్​ చేశాడు.

By

Published : Sep 14, 2019, 3:57 PM IST

Updated : Sep 30, 2019, 2:25 PM IST

యాషెస్​: స్మిత్​ చేతిలో పాకిస్థాన్​ దిగ్గజ రికార్డు బ్రేక్​

ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్​​, టెస్టుల్లో నెం.1 బ్యాట్స్​మెన్​ స్టీవ్​ స్మిత్​ మరో ఘనత సాధించాడు. పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ ఇంజమామ్​ ఉల్​ హక్ పేరిట ఉన్న ఒక జట్టుపై అత్యధిక 50+ స్కోర్ల రికార్డును బ్రేక్​ చేశాడు. ఓవల్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఈ ఘనత సాధించాడు.

అత్యధిక అర్ధసెంచరీలు...

టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్​పై అత్యధికంగా యాభైకి పైగా స్కోర్లు సాధించిన రికార్డును సాధించాడు స్మిత్. ఇప్పటివరకు ఇంగ్లీష్​ జట్టుపై ఇంజమామ్​ 9 సార్లు 50+ స్కోరు చేశాడు. స్మిత్​ వరుసగా పదిసార్లు ఆ స్కోరు చేసి పాక్​ మాజీ ఆటగాడి రికార్డును బద్దలు గొట్టాడు. 30 ఏళ్ల స్మిత్ ఈ సిరీస్‌లో 751 పరుగులు చేశాడు. ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 80 పరుగులు చేశాడు. కొద్దిలో శతకం చేజార్చుకుని ఈ సిరీస్​లో తక్కువ పరుగుల వ్యక్తిగత మార్కును అందుకున్నాడు.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details