తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనినే మన్కడింగ్​ చేయాలనుకున్నాడా..?

ఐపీఎల్​లో వివాదాస్పదమైన అంశం మన్కడింగ్​. రాజస్థాన్​ బ్యాట్స్​మెన్​ బట్లర్​ను అశ్విన్​ ఔట్​ చేసినట్లే.. ధోనీని అదే తరహాలో ఔట్​ చేయాలని కృనాల్​ పాండ్య ప్రయత్నించాడని కొందరు నెటిజన్లు అంటున్నారు.

By

Published : Apr 5, 2019, 4:00 AM IST

Updated : Apr 5, 2019, 10:27 AM IST

ధోనినే మన్కడింగ్​ చేయాలనుకున్నాడా..?

పంజాబ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను మన్కడింగ్​ పద్ధతిలో ఔట్ చేయకుండా హెచ్చరిండంపై ముంబయి ఆటగాడు కృనాల్​ను అభిమానులు ప్రశంసించారు. అయితే చెన్నైతో మ్యాచ్‌లో ధోనికి కృనాల్​ మన్కడింగ్ హెచ్చరిక చేశాడని కొందరు నెటిజన్లు అంటున్నారు.

  • చెన్నై ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కేదార్ జాదవ్‌కు బౌలింగ్ చేస్తున్న కృనాల్.. యాక్షన్​ను మధ్యలోనే ఆపి నాన్​స్ట్రెకింగ్​ ఎండ్​లో ఉన్న ధోనికి పరోక్షంగా మన్కడింగ్ హెచ్చరిక ఇచ్చినట్లు కనిపించాడు. ఆ సమయానికి ధోని బ్యాట్ క్రీజులోనే ఉంది. ఈ ఘటనపై అభిమానులు కృనాల్​పై ట్వీట్ల వర్షం కురిపించారు.

ధోని లాంటి తెలివైన, అత్యుత్తమ ఆటగాడిని నువ్వు మన్కడింగ్​ చేయగలవా అంటూ కృనాల్​పై విమర్శలు చేశారు కొందరు నెటిజన్లు. మన్కడింగ్ హెచ్చరిక ఇవ్వలేదు.. కావాలనే రన్నప్​​ మధ్యలోనే ఆపేశాడంటూ మరికొందరు అతడిని సమర్థించారు.

Last Updated : Apr 5, 2019, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details