తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి భారీ విజయానికి పుష్కరం

ప్రపంచ క్రికెట్​ చరిత్రలో భారత్​ సంచలన విజయం సాధించింది ఈరోజే. అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా టీమిండియా అవతరించింది. తొలిసారి భారత్​ 400 పైగా పరుగులు చేసి ఆ మార్కు అందుకున్న 5వ దేశంగా ప్రశంసలు అందుకుంది.

By

Published : Mar 19, 2019, 1:39 PM IST

Updated : Mar 19, 2019, 8:52 PM IST

భారత్​కు తొలి భారీ విజయం

సాధారణంగా వన్డేల్లో 400 పైగా పరుగులు సాధించాలంటే ఏ దేశానికైనా బలమైన బ్యాటింగ్​ లైనప్​ ఉండాల్సిందే. 2007లో మనం ఈ రికార్డు సాధించేటప్పటికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక మాత్రమే ఈ ఘనత సాధించాయి. కానీ తొలిసారి భారత్​ తన విధ్వంసకర బ్యాటింగ్​ను ప్రదర్శించింది. ఫలితంగా ప్రపంచకప్​లో శ్రీలంక పేరిట ఉన్న 398 పరుగులు రికార్డు బద్దలైంది.

బెర్ముడాపై తొలుత బ్యాటింగ్​ ఆరంభించిన భారత్​ 50 ఓవర్లలో 413 పరుగులు భారీ స్కోర్ చేసింది. సెహ్వాగ్​ 114 పరుగులు, గంగూలీ 89, యువరాజ్​ 83, సచిన్​ 57 నాటౌట్​గా నిలిచారు. లక్ష్య ఛేదనలో బెర్ముడా 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో 257 పరుగుల భారీ విజయం టీమిండియా​ సొంతమైంది.

ప్రపంచకప్​లో భారత్​ మ్యాచ్​లో బెర్ముడా ఆటగాళ్లు
  • మ్యాచ్​ ముఖ్యాంశాలు:
  1. 257 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన మొదటి దేశంగా భారత్​ రికార్డు సృష్టించింది.
  2. 2011 వరకు ఏ దేశం ప్రపంచకప్​లో 400 పరుగులు చేయలేకపోయింది.
  3. కుంబ్లే ఈ మ్యాచ్​ తర్వాత వన్డేల్లో ఆడలేదు.
  4. బెర్ముడాపై గెలిచిన భారత్​ తర్వాత ఆ తర్వాత వన్డేలో ఊహించని ఓటమి ఎదుర్కొంది. పసికూన బంగ్లాదేశ్​పై ఓడిపోయి ప్రపంచకప్​ నుంచి ఇంటిముఖం పట్టింది.

.

Last Updated : Mar 19, 2019, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details