తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్తా... వచ్చేయ్​'

భారత మాజీ క్రికెటర్​ గంభీర్​, అఫ్రిది మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అఫ్రిదిని దగ్గరుండి మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తానంటూ కౌంటర్​ ఇచ్చాడు గంభీర్​. దీనికి ముందు అఫ్రిది తన ఆత్మకథ ‘గేమ్‌ ఛేంజర్‌’లో గంభీర్​ వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

By

Published : May 4, 2019, 1:12 PM IST

Updated : May 4, 2019, 2:40 PM IST

ఆత్మకథలో ఆఫ్రిది వ్యాఖ్యలకు గంభీర్​ కౌంటర్​

పాకిస్థాన్​ మాజీ ఆటగాడు అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్​ ఇచ్చాడు గంభీర్​. 'దగ్గరుండి మానసిన వైద్యుడి వద్దకు తీసుకెళ్తా' అని దాయాది ఆటగాడికి సూచించాడు భారత స్టార్​ బ్యాట్స్​మెన్​.

అఫ్రిది ఇటీవలే తన వయసు గురించి ఆత్మకథలో నిజాలు బయటపెట్టాడు. గంభీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.'గంభీర్​ వ్యక్తిత్వమే లేని ఆటగాడు. డాన్‌ బ్రాడ్‌మన్‌, జేమ్స్‌బాండ్‌ లక్షణాలు ఆయనలోనే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాడు. చెప్పుకోదగ్గ ఒక్క రికార్డు గంభీర్‌కు లేకపోయినా... కేవలం అతని ప్రవర్తనతోనే అందరి నోళ్లలో నానుతుంటాడు' అని అన్నాడు అఫ్రిది.

స్పందించిన గౌతీ​ కౌంటర్​ వ్యాఖ్యలు చేశాడు.

'నువ్వొక కామెడీ పర్సన్​వి. మా దేశం మెడికల్​ టూరిజంలో భాగంగా పాకిస్థానీయులకు వీసాలు ఇస్తోంది. నువ్వు వస్తే నేనే దగ్గరుండి మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తా '
-- గంభీర్​, భారత మాజీ క్రికెటర్​

2007 ఆసియాకప్‌లో గంభీర్​-అఫ్రిది మధ్య గొడవ జరిగింది.

Last Updated : May 4, 2019, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details