తెలంగాణ

telangana

ETV Bharat / sports

వివాహంతో ఒక్కటైన మహిళా క్రికెటర్ల జంట

న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ హలే జెన్సెన్‌, ఆస్ట్రేలియా  క్రికెటర్​ నికోలా హాన్‌కాక్‌ను పెళ్లాడారు. వారం రోజుల క్రితం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైనట్లు...నికోలా ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ట్విట్టర్‌లో పేర్కొంది.

By

Published : Apr 19, 2019, 6:15 AM IST

వివాహంతో ఒక్కటైన మహిళా క్రికెటర్ల జంట

మహిళా కివీస్​ జట్టులోని ప్రఖ్యాత క్రీడాకారిణి హలే జెన్సెన్‌​...ఆస్ట్రేలియా క్రికెటర్​ నికోలా హాన్​కాక్​ను పెళ్లిచేసుకుంది. ఈ మేరకు శుభాకాంక్షలు తెలుపుతూ నికోలా ప్రాతినిధ్యం వహిస్తున్న మెల్​బోర్న్​ స్టార్స్​ జట్టు ట్వీట్​ చేసింది.

'గత వారం తన భాగస్వామి హెలే జెన్సెన్‌ను పెళ్లాడిన మా స్టార్‌ బౌలర్‌ హాన్‌కాక్‌కు టీమ్‌గ్రీన్‌ తరఫున శుభాభినందనలు’ అంటూ కొత్త జంట ఫొటోను షేర్‌ చేసింది మెల్​బోర్న్​ స్టార్స్.

మంచి క్రికెటర్​...

2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జెన్సెన్‌... కివీస్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 2015లో జరిగిన ఓ మ్యాచ్‌లో 122 పరుగులు చేసి మహిళా క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఆమె జీవిత భాగస్వామి నికోలా హాన్‌కాక్‌ మహిళా బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది.

రెండు దేశాల్లో ఆమోదం...

స్వలింగ వివాహాలు ఇరుదేశాల్లో చట్టబద్ధమైనవే. ఆగస్టు 19, 2013 నుంచి న్యూజిలాండ్​లో ఇటువంటి వివాహాలను చట్టబద్ధం చేయాలన్న అంశంపై బిల్లు చర్చకు రాగా...మద్దతుగా 77 ఓట్లు, వ్యతిరేకంగా 44 ఓట్లు రావడం వల్ల పార్లమెంటులో బిల్లు​ ఆమోదం పొందింది. ఆస్ట్రేలియాలోనూ డిసెంబరు 9, 2017 నుంచి స్వలింగ వివాహాలను అధికారికంగా ఆమోదించారు. దీనికి 61.6 శాతం మంది కంగారూ దేశస్థులు మద్దతిచ్చారు.

క్రికెట్‌ లెస్బియన్‌ జంట పెళ్లి చేసుకోవడం ఇది తొలిసారి కాదు. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్, ఆల్‌రౌండర్‌ మరిజాన్‌ కాప్‌ గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ABOUT THE AUTHOR

...view details