తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు అడ్డుగా స్మిత్​... పోరాడుతున్న ఆసీస్​

బర్మింగ్​హామ్ వేదికగా జరుగుతోన్న యాషెస్ సిరీస్​ తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 374 పరగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన కంగారూ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్, ట్రేవిస్ హెడ్ ఉన్నారు.

By

Published : Aug 4, 2019, 8:38 AM IST

యాషెస్​

యాషెస్ సిరీస్​ తొలి టెస్టులో రెండో రోజు పట్టుబిగించిన ఇంగ్లాండ్ మూడో రోజు భారీ స్కోరు చేస్తుందని ఆశించారు అభిమానులు. అయితే ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల మరో 97 పరుగులు మాత్రమే చేయగలిగింది ఇంగ్లీష్ జట్టు. 267 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 374 పరుగులకు ఆలౌటైంది.

మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత బెన్​ స్టోక్స్​తో(50) మొదలైన వికెట్ల పతనం అండర్సన్​తో(3) ముగిసింది. చివర్లో టెయిలెండర్లు క్రిస్ వోక్స్(37)​, స్టువర్ట్​ బ్రాడ్(29)​ కాసేపు వికెట్లకు అడ్డుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, లయోన్ చెరో 3 వికెట్లు తీయగా.. జేమ్స్ ప్యాటిన్సన్, పీటర్ సిడిల్ చెరో 2 వికెట్ల తమ ఖాతాలో వేసుకున్నారు.

మరోసారి ఆసీస్​ ఓపెనర్లు విఫలం..

అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఓపెనర్లు బాన్​క్రాఫ్ట్(7)​, వార్నర్(8) మరోసారి విఫలమయ్యారు. ఖవాజా 13 పరుగులకే వెనుదిరిగినందున 35కే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆసీస్​. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్(46).. ట్రేవిస్ హెడ్(21) సాయంతో ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ ఇప్పటికే 89 పరుగుల భాగస్వామ్యన్ని నమోదు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఇంగ్లీష్ బౌలర్లలో బ్రాడ్, స్టోక్స్, మొయిన్ అలీ తలో వికెట్ తీసుకున్నారు.

ఇంగ్లీష్ బౌలర్లు

ఇంగ్లాండ్​కు స్మిత్ అడ్డు..

తొలి ఇన్నింగ్స్​లో సెంచరీతో ఆదుకున్న స్టీవ్ స్మిత్​పైనే ఆశలు పెట్టుకుంది ఆసీస్​. ప్రస్తుతం ఆర్ధశతకానికి దగ్గరలో ఉన్నాడు స్మిత్. ఈ మాజీ సారథిని​ పెవిలియన్ పంపేందుకు వ్యూహాలు రచిస్తోంది ఇంగ్లాండ్. ఇప్పటికైతే మ్యాచ్​ ఇంగ్లీష్​ జట్టు వైపే ఉంది. నాలుగో రోజు తొలి సెషన్​లోనే స్మిత్​కు అడ్డుకట్టవేసి ఆసీస్​ను తక్కువ పరుగులకే ఆలౌట్​చేస్తే రూట్​ సేన గెలుపు లాంఛనమే అవుతుంది.

స్టీవ్ స్మిత్

తొలి ఇన్నింగ్స్​లో స్మిత్(144) సెంచరీ చేయడం వల్ల ఆసీస్ 284 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్​ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

ఇది చదవండి: విండీస్​పై 4 వికెట్ల తేడాతో భారత్​ గెలుపు​

ABOUT THE AUTHOR

...view details