తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హీరోలు నల్లగా ఎందుకు ఉన్నారో..?

బాలీవుడ్​లో వివక్షతో పాటు పాత్రను బట్టి నటుల శరీర రంగును మార్చి చూపిస్తున్న తీరుపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. తాజాగా హృతిక్​ నటించిన సూపర్​-30 సినిమాతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కిందిస్థాయి వారు, పేదలు, శ్రామికులంతా నల్లగా లేదా చామన ఛాయలోనే ఉంటారని బాలీవుడ్​ చెప్పాలనుకుంటోందన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ఇది వివక్షకు నిదర్శనమంటూ ఆరోపణలు వస్తున్నాయి.

By

Published : Jun 8, 2019, 4:38 PM IST

Updated : Jun 9, 2019, 8:44 AM IST

బాలీవుడ్

పాత్రలను బట్టి నటులకు విభిన్న మేకప్​లు వేయడం సహజం. అయితే మరీ శరీర రంగు మార్చేసేంతలా అవసరమా అన్నదే ప్రధాన చర్చ. ముఖ్యంగా బాలీవుడ్​ సినిమాలను నిశితంగా పరిశీలిస్తే.. ఉన్నతస్థాయి, ధనికుల పాత్రల్లో నటించే వారు తెల్లగా ఉంటారు. దిగువ తరగతి వారు, పేదలు, శ్రామికులను నల్లగా లేదా చామన ఛాయలో చూపిస్తుంటారు.

ఉడ్తాపంజాబ్​లో ఆలియా

మదర్​ ఇండియా సినిమాలో రైతుగా నటించిన సునీల్ దత్​ను, ఉడ్తా పంజాబ్ సినిమాలో ఆలియా భట్​ను చామన ఛాయలో చూపించారు దర్శకులు. నిజానికి వారి శరీర వర్ణం తెలుపు. మరి అలా ఎందుకు తెరకెక్కించారు? పాత్రధారులు తెల్లగా ఉన్నా... భారీ మేకప్​ వేసి మరీ రంగు మార్చి చూపించడంలో అంతర్యమేమిటి? ఇది వివక్షేనంటూ దశాబ్దాల కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా సూపర్​-30 చిత్రంతో మరోసారి ఆ అంశం తెరపైకి వచ్చింది.

సూపర్​-30 లో....

సూపర్​ 30లో హృతిక్​

హృతిక్​ రోషన్​ నటించిన సూపర్​-30 సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం బిహార్​కు చెందిన గణిత శాస్త్ర మేధావి ఆనంద్​ కుమార్​ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఎంతో మంది పేద విద్యార్థులను పోటీ పరీక్షల కోసం తీర్చిదిద్దిన ఆనంద్​ పాత్ర హృతిక్​ది.

ఆనంద్ పాత్ర కోసం హృతిక్​కు వేసిన మేకప్​ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తెల్లగా ఉన్న హృతిక్​ను ఈ చిత్రంలో చామన ఛాయలో ఎందుకు చూపించాలనుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కిందిస్థాయి వారు చామని ఛాయ లేదా నల్ల రంగు శరీర వర్ణంతోనే ఉంటారని సినిమాల్లో ఎప్పటికీ మూసధోరణిలోనే చూపిస్తారని సోషియాలజిస్ట్​ సంజయ్​ శ్రీవాత్సవ అన్నారు.

"స్థాయిలను ఊహించుకునే మూస ధోరణులు.. ప్రకటనలు, సినిమాల వల్లే ఎక్కువయ్యాయి. తెల్లగా ఉండడమే విజయం అన్న భావనను తీసుకొచ్చాయి. దీన్ని నేరమని చాలా మంది భావించడం లేదు. ప్రజలు కూడా దీన్ని ఖండించడం లేదు."
- శ్రీవాత్సవ, సోషియాలజిస్ట్

హృతిక్​ రంగు మార్చి చూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.

"బిహార్​ ప్రజలందరూ బొగ్గు గనుల్లో నివసించట్లేదని అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో చాలా మందికి ముఖం కడుక్కునేందుకు సబ్బులు సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి."
-- సోషల్​ మీడియాలో ఓ పీహెచ్​డీ విద్యార్థి అసంతృప్తి

"నాకు హృతిక్​ అంటే చాలా ఇష్టం. కానీ ఆయన చామన ఛాయలో కనిపించడం నచ్చలేదు. ఓ యాక్టర్​కు ఆ రంగు మేకప్​ వేస్తే పేదవారిగా కనిపిస్తారని అనుకుంటున్నారు. వెల్​డన్​ బాలీవుడ్.​"
-- మరో నెటిజన్​ అభిప్రాయం

వీరి అభిప్రాయాలను చాలా మంది సమర్థించారు.

గల్లీబాయ్​లోనూ...

గల్లీబాయ్​లో రణ్​​వీర్ సింగ్​

గల్లీబాయ్ సినిమాలోనూ స్ట్రీట్ రాపర్​గా నటించిన రణ్​బీర్​ సింగ్​నూ చామన ఛాయలోనే చూపించారు దర్శకురాలు. ఆ సినిమాకు ఆధారమైన ముక్తార్​ అహ్మద్​ తెల్లగానే ఉన్నా.. రణ్​వీర్​ రంగును మార్చి చూపించారు. ఇలా చేయడాన్ని దర్శకురాలు జోయా అక్తర్​ సమర్థించుకున్నారు కూడా.

ప్యాడ్​మ్యాన్​ మాత్రం భిన్నం...

తమిళనాడుకు చెందిన సామాజిక వేత్త అరుణాచలం మురుగనాథమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ప్యాడ్​మ్యాన్​​ సినిమా మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఉంది. మురుగనాథమ్​ నల్లగా ఉన్నా.. అక్షయ్ కుమార్​ మాత్రం ఆ సినిమాలో మేకప్ లేకుండా నటించాడు.

Last Updated : Jun 9, 2019, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details