తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ లేఖపై ఇమ్రాన్ హర్షం..చర్చలకు ఆహ్వానం!

పాకిస్థాన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన లేఖను పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్  స్వాగతించారు. అతి ముఖ్యమైన కశ్మీర్​ అంశం సహా వివిధ సమస్యలపై ఇరు దేశాల మధ్య చర్చకు ఇదే సరైన అవకాశమని పేర్కొన్నారు ఇమ్రాన్.

By

Published : Mar 23, 2019, 2:36 PM IST

మోదీ లేఖకు ఇమ్రాన్​ఖాన్ స్పందన

మోదీ లేఖకు ఇమ్రాన్​ఖాన్ స్పందన
పాకిస్థాన్​ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన లేఖను ఇమ్రాన్​ఖాన్ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల్ని ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని తన ట్విట్టర్​ ఖాతాలో పేర్కొన్నారు.

"మన ప్రజలకు మోదీ తెలిపిన శుభాకాంక్షల్ని స్వాగతిస్తున్నా. అతి ముఖ్యమైన కశ్మీర్​ అంశం సహా వివిధ సమస్యలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని కోరుకుంటున్నా. రెండు దేశాల ప్రజల శాంతి కోసం నూతన బంధాలను ఏర్పరచుకోవాలని ఆకాంక్షిస్తున్నా."-ఇమ్రాన్​ఖాన్, ట్విట్టర్

ఇమ్రాన్ ట్వీట్

పాక్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాద వ్యతిరేక దక్షిణాసియా నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని కోరుతూ ఇమ్రాన్​ఖాన్​కు లేఖ రాశారు మోదీ. పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్​ ప్రధానికి మోదీ లేఖ రాయడం విశేషం. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, శాంతియుత దక్షిణాసియాను తయారుచేసేందుకు కలిసి నడవాలన్నారు మోదీ.

పాక్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ హైకమిషనర్​ దిల్లీలో ఇచ్చే విందుకు భారత్​ గైర్హాజరైంది. జమ్ముకశ్మీర్​ నుంచి వేర్పాటువాద నేతల్ని ఈ విందుకు ఆహ్వానించడమే కారణంగా పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details