తెలంగాణ

telangana

ETV Bharat / international

నిరసనలతో భగ్గుమన్న ఇండోనేషియా- 20 మంది మృతి

జాతివివక్ష వ్యాఖ్యల నేపథ్యంలో ఇండోనేషియాలోని పపువా రాష్ట్రం భగ్గుమంది. వందలాది నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి నివాసాలకు, దుకాణాలకు నిప్పింటించారు. ఆందోళనల్లో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.

By

Published : Sep 24, 2019, 5:32 AM IST

Updated : Oct 1, 2019, 7:02 PM IST

నిరసనలతో భగ్గుమన్న ఇండోనేషియా- 20మంది మృతి

ఇండోనేషియాలో నిరసనలు భగ్గుమన్నాయి. పపువా రాష్ట్రంలోని వామెనా నగరంలో విజృంభించిన వందలాది ఆందోళనకారులు.. స్థానిక ప్రభుత్వ భవనాలు, దుకాణాలు, నివాసాలకు నిప్పింటించారు. ఈ ఘటనలో 20మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో నిరసనలు మొదలయ్యాయి.

నిరసనలతో భగ్గుమన్న ఇండోనేషియా

స్వల్ప కాలంలోనే ఈ ఆందోళనలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. పపువా రాజధాని జయపురాలో జరిగిన నిరసనల్లో ఓ సైనికుడితో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

అయితే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఉపాధ్యాయుడు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్టు ఆధారాలు లభించలేదని తెలిపారు. ఇతర పాఠశాలల్లో, ప్రాంతీయ సంఘాల్లో.. కొందరు అసత్యాలను వ్యాపింపజేస్తున్నారన్నారు. నిరసనలు సృష్టించడానికే ఎవరో ఇదంతా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:సరస్సులో స్ట్రా వేసి నీళ్లు తాగిన టోర్నడో!

Last Updated : Oct 1, 2019, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details