'ఫోర్బ్స్ 2021 ఆసియా 30 అండర్ 30' జాబితాలో భారతీయులు సత్తా చాటారు. ఏప్రిల్‌లో విడుదలైన ఈ జాబితాలో మొత్తం 76 మందికి ఈ జాబితాలో చోటు లభించింది. 30ఏళ్లలోపు యువతీ యువకులు వారు ఎంచుకున్న రంగంలో అత్యంత సృజనాత్మకతతో, ధైర్యంగా ముందుకు సాగుతూ సమాజంపై ప్రభావం చూపుతున్న వారిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో చైనా (36), జపాన్ (31 ఉన్నాయి.
సింగపూర్ నుంచి 8మంది భారతీయులు..
ఈ జాబితాలో చోటు దక్కిన వారు ఏ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే వారి దేశంగా భావిస్తున్న నేపథ్యంలో భారతీయులు ఇతర నగరాల్లో ఎక్కువగా ఉన్నారు. ఈ జాబితాలో 27 ఎంట్రీలతో సింగపూర్ 4వ స్థానంలో నిలిచింది. మొత్తం 31 మంది వ్యక్తులు ఉండగా అందులో 8 మంది భారతీయులే ఉండటం గమనార్హం. ఒక సంస్థ నుంచి ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఒకే ఎంట్రీగా భావిస్తారు.
సింగపూర్ ఒక చిన్న దేశం అయినప్పటికీ, పటిష్ఠ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. ఆకర్షణీయమైన ప్రభుత్వ పథకాలు, ప్రోత్సోహకాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే విధానాల కారణంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతను సింగపూర్ వైపు నడిపిస్తున్నాయి.
గత ఆరేళ్లుగా ఆసియా జాబితాను విడుదల చేస్తోంది పోర్బ్స్. 30 మంది వ్యవస్థాపకులు లేక బృందాలను 10 అంశాలను పరిగణించి ఈ జాబితాను రూపొందిస్తారు. అందులో ప్రధానంగా సమాజంపై ప్రభావం, కళలు, వినోదం, క్రీడలు, ఫైనాన్స్, హెల్త్‌కేర్ అండ్ సైన్స్, వినియోగదారుల సాంకేతికత వంటివి ఉన్నాయి.
జాబితాలోని కీలక అంశాలు...
- ఈ ఏడాది ఆసియా జాబితాలో 15.6 శాతం మంది 23 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. జాబితాలోని వారి సగటు వయస్సు 26.5 శాతం. జపాన్‌కు చెందిన 11 ఏళ్ల సుమైర్ నకమురా అంత్య పిన్న వయస్కుడిగా రికార్డు సాధించారు.
- ఈసారి విడుదలైన జాబితాలో 22 ప్రాంతాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయినప్పటికీ దాదాపు రెండింట మూడొంతులు టాప్-5 దేశాల నుంచే ఉన్నారు. దీని ద్వారా.. సృజనాత్మక ఆలోచనలు, యువతను ప్రోత్సహించే వాతావరణం ఆయా దేశాల్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
- ఈ జాబితాలో 67.8 శాతం మంది సంస్థల వ్యవస్థాపకులు, సహా వ్యవస్థాపకులు ఉన్నారు.
సింగ్‌పూర్ టెక్ సంస్థ టీమ్ ల్యాబ్స్ సీఈఓ, భారత సంతతి వ్యక్తి హర్ష దలాల్ పేరును ఆసియా 30 జాబితా నుంచి తొలగించిన క్రమంలో కొద్ది రోజుల క్రితం ఈ జాబితాపై కొంత వ్యతిరేకత వచ్చింది. టెక్ ఇన్ ఆసియాలో టీమ్ ల్యాబ్స్‌పై వ్యతిరేక వార్తలు వచ్చిన క్రమంలో దలాల్ సంస్థపై చర్యలు చేపట్టింది పోర్బ్స్ సంస్థ. అతని పేరును తొలగించింది.
ఇదీ చూడండి:లాక్డౌన్లో సరికొత్త వెంచర్లు.. కళల్లో నైపుణ్యం.. ఫోర్బ్స్‌లో చోటు