తెలంగాణ

telangana

ETV Bharat / international

మొదటిసారి భేటీకానున్న ట్రంప్, ఇమ్రాన్​ఖాన్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ జూలై 22న మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. మొదటిసారి సమావేశం కానున్న ఇరువురు నేతలు... ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

By

Published : Jul 4, 2019, 8:05 PM IST

మొదటిసారి భేటీకానున్న ట్రంప్, ఇమ్రాన్​ఖాన్​

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ జూలై 22న మొదటిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతిపై ఇరువురు నేతలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇటీవల పాకిస్థాన్​పై బహిరంగంగా విమర్శలు చేసిన ట్రంప్ సైనిక సాయం నిలిపివేశారు. ఉగ్రవాద నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకోవాలనీ సూచించారు.

డొనాల్డ్​ ట్రంప్ ఆహ్వానం మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ మొదటిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని, ఆ దేశ విదేశాంగమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ముహమ్మద్​ ఫైసల్​ తెలిపారు.

ఉగ్రవాదుల స్వర్గధామం...

గతేడాది ట్రంప్ బహిరంగంగా పాక్​పై విమర్శలు గుప్పించారు. వాషింగ్టన్​కు ఇస్లామాబాద్ ఏమీ సహకరించడంలేదని ఆరోపించారు. అబద్దాలు చెబుతూ మోసాలకు పాల్పడుతోందని, ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని విమర్శించారు. దీంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడ్డాయి.

ఇమ్రాన్​ఖాన్​ కూడా ట్రంప్​పై విమర్శలు చేశారు. 2018 జనవరిలో మాట్లాడుతూ ట్రంప్​తో భేటీ కావడం చేదు మాత్ర మింగడం లాంటిదని వ్యాఖ్యానించారు. అయితే తాను తప్పకుండా ట్రంప్​తో సమావేశమవుతానని ఇమ్రాన్ అన్నారు.

అదే ప్రధాన అజెండా..

ఇమ్రాన్​ఖాన్​- ట్రంప్​ భేటీ ప్రధాన అజెండా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే' అని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఫైసల్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అహ్మదాబాద్: కన్నుల పండువగా జగన్నాథయాత్ర

ABOUT THE AUTHOR

...view details