తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇమ్రాన్​ దుందుడుకు మాటలు తగ్గించుకోండి: ట్రంప్​

భారత్​పై దుందుడుకు వ్యాఖ్యలు తగ్గించుకోవాలని పాక్​ ప్రధానికి ట్రంప్​ తెలిపారు. జమ్ముకశ్మీర్​ విషయమై సోమవారం ట్రంప్​తో మోదీ మాట్లాడిన అనంతరం అమెరికా అధ్యక్షుడు పాక్​ ప్రధానితో ఫోన్​లో సంభాషించారు. భారత్​-పాక్​ మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు ట్రంప్​.

By

Published : Aug 20, 2019, 9:06 AM IST

Updated : Sep 27, 2019, 3:05 PM IST

ఇమ్రాన్​ దుందుడుకు మాటలు తగ్గించుకోండి: ట్రంప్​

ఇమ్రాన్​ దుందుడుకు మాటలు తగ్గించుకోండి: ట్రంప్​

జమ్ము కశ్మీర్​ విషయంలో దుందుడుకు వ్యాఖ్యలు తగ్గించుకోవాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సూచించారు. అమెరికా అధ్యక్షుడితో భారత ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ఫోన్​ సంభాషణ అనంతరం.. ట్రంప్​ పాక్​ ప్రధానితో ఈ విధంగా మాట్లాడారు.

భారత్​-పాక్​లు శాంతియుత చర్చల ద్వారా కశ్మీర్​ సమస్యను పరిష్కరించుకోవాలని ఇమ్రాన్​ఖాన్​కు ట్రంప్ హితవు పలికినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు చెలరేగకుండా చూడాలని, ఇరుదేశాలు సంయమనం పాటించాలని ట్రంప్​ కోరినట్టు తెలిపింది.

"నేను నా ఇద్దరు మిత్రులు... మోదీ, ఇమ్రాన్​ఖాన్​తో మాట్లాడాను. వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి మేం చర్చించాం. ముఖ్యంగా భారత్​-పాక్​లు... కశ్మీర్​లో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కృషి చేయడం గురించి చర్చించాను." - డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

ఈ వారంలో పాక్​ ప్రధానితో ట్రంప్​ సంభాషించడం ఇది రెండోసారి.

రెచ్చగొట్టద్దు... జాగ్రత్త

ఇటీవలి కాలంలో ఇమ్రాన్​ఖాన్​ భారత్​పై పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ దుందుడు వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఇదే విషయమై సోమవారం అమెరికా అధ్యక్షుడితో మోదీ ఫోన్​లో సంభాషించారు.

కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు..

భారత్​... జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ చర్యలపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్​ ప్రధాని దుందుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది తమ అంతర్గత విషయమని భారత్​ తేల్చి చెప్పింది.​

ఇదీ చూడండి: 'రాజీవ్ నిర్ణయాలే సమాచార విప్లవానికి పునాది'

Last Updated : Sep 27, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details