తెలంగాణ

telangana

ETV Bharat / international

క్షణాల్లోనే శరీర కొలతలు చెప్పే నయా టెక్​

మహిళలు లోదుస్తుల కొనుగోలు విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. సరైన సైజు దొరక్క సతమతమవుతూ ఉంటారు. జపాన్​లో ఓ కంపెనీ మాత్రం 3డీ టెక్నాలజీతో స్కానింగ్​ చేసి సెకన్లలో కొలతలు తీసిస్తోంది. కస్టమర్స్​కు ఎలాంటి అభద్రతా భావం, అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారిక్కడ.

By

Published : Jul 17, 2019, 10:45 AM IST

క్షణాల్లో కచ్చితమైన కొలతలు తీసిచ్చే సాంకేతికత

క్షణాల్లో కచ్చితమైన కొలతలు తీసిచ్చే సాంకేతికత

మహిళలు లోదుస్తులు కొనాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సరైన కొలతల్లో లోదుస్తులు కొనుక్కోవటం వారికి సవాలే. ఒక్కోసారి అవి సరిపడక అసౌకర్యానికి లోనవుతారు. ఇలాంటి సమస్యలకు చెక్​ పెడుతూ జపాన్​లోని 'వాకోల్'​ మహిళల లోదుస్తుల కంపెనీ.. కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. టోక్యోలోని హరాజుకు స్టోర్​లో త్రీడీ టెక్నాలజీని జోడించి శరీరాన్ని స్కాన్​ చేసి సెకన్లలో కొలతలు తీసిస్తున్నారు.

"మేము ఈ స్కానర్​ను రూపొందించడానికి కారణం.. మాకు చాలామంది కస్టమర్ల నుంచి సూచనలు వచ్చాయి. వారు సేల్స్​ సిబ్బందితో లోదుస్తుల కొలతల విషయంలో చర్చించే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అలాగే వాటిని ధరించేటప్పుడు సరిగ్గా సరిపోయే విధంగా ఉండాలని కోరుకున్నారు."

-చీజా మినామి, త్రీడీ స్మార్ట్​ & ట్రై బోధకుడు

స్టోర్​కు వచ్చే వినియోగదారులకు ఎలాంటి అభద్రతాభావం, ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్కానింగ్​ సమయంలో శరీరాన్ని ఎవరూ చూడలేరు. స్కానింగ్​ ప్రారంభంలో స్క్రీన్​ మీద ఉన్న నియమాలను పాటించాలి. ఆ సమయంలో పక్కన ఉన్న బార్​ను చేత్తో పట్టుకుని నిలబడితే చుట్టూ ఉన్న కెమెరాలు కొలతలు తీసుకుంటాయి.

స్కానింగ్​ అయిపోయాక వినియోగదారులు 'ఫురేరు చాన్' అనే కృత్రిమ మేథను కానీ, స్టోర్​లోని సలహాదారున్ని గానీ సంప్రదించి.. సరిపడే లోదుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ మీ కొలతలను ప్రింట్​ అవుట్ కూడా తీసుకోవచ్చు. స్కానింగ్​ పద్దతి వచ్చిన తొలి 24 రోజుల్లోనే 1000 మంది కస్టమర్స్ దీన్ని వినియోగించుకున్నారని స్టోర్ యాజమాన్యం తెలిపింది.

ఇదీ చూడండి: నాటు పడవలో పుట్టిన అసోం కృష్ణుడు

ABOUT THE AUTHOR

...view details