తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో మరో మారణహోమం- 14మంది మృతి

పాకిస్థాన్ బలూచిస్థాన్​లో మారణహోమానికి ఒడిగట్టారు దుండగులు. పారా మిలటరీ బలగాల దుస్తుల్లో కరాచీ నుంచి గ్వాడార్​ వెళ్తున్న బస్సుల్లో తనిఖీలు నిర్వహించి... 14 మందిని నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపారు. ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Apr 18, 2019, 2:11 PM IST

పాక్​లో మరో మారణహోమం... 14 మంది మృతి

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​లో బస్సులో ప్రయాణిస్తున్న 14 మందిని కాల్చి చంపారు దుండగులు. పారా మిలటరీ బలగాల దుస్తుల్లో దాదాపు 15 నుంచి 20 మంది గుర్తుతెలియని దుండగు​లు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కరాచీ నుంచి గ్వాడార్​ వెళ్తున్న ఆరు బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. బలూచిస్థాన్​ ఓర్మారా ప్రాంతంలోని మాక్రన్​ కోస్టల్​ హైవేపై ప్రయాణికుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. అనంతరం 16 మందిని కిందకు దింపేశారు. 14 మందిని అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపారు. మరో ఇద్దరు ఈ మారణహోమం నుంచి తప్పించుకుని సమీపంలోని లెవీస్​ చెక్​పోస్ట్​కు చేరుకోగలిగారు. వారిరువురికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు అధికారులు.

సమాచారం అందుకున్న వెంటనే లెవీస్​ చెక్​పోస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వారిని చంపడం వెనకున్న ఆంతర్యం ఇంకా తెలియలేదని చెప్పారు.

బలూచిస్థాన్​ ముఖ్యమంత్రి జామ్ కమాల్​, హోంమంత్రి జియా లాంగోవ్​ దుండగుల చర్యను తీవ్రంగా ఖండించారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని ప్రకటించారు.

ఇదీ చూడండి : భాజపా ఎంపీ జీవీఎల్​పై 'షూ'తో దాడి

ABOUT THE AUTHOR

...view details