తెలంగాణ

telangana

ETV Bharat / international

'హాట్​డాగ్​' తిండిబోతు విజేతలు జోస్, మికీ

న్యూయార్క్​లోని కోనీ ద్వీపంలో నిర్వహించిన హాట్​డాగ్ తిండిపోటీల్లో... 71 వీఎనర్లు, రొట్టెలు తీనేసి జోయి జాస్ మరోసారి​ విజేతగా నిలిచాడు. స్త్రీల విభాగంలో 31 వీఎనర్లు, రొట్టెలు లాగించేసి మికీ సూడో టైటిల్ నిలబెట్టుకుంది.

By

Published : Jul 5, 2019, 2:17 PM IST

తిండిబోతు విజేతలు

'హాట్​డాగ్​' తిండిబోతు విజేతలు జోస్, మికీ
అమెరికా న్యూయార్క్​లోని కోనీ ద్వీపంలో నిర్వహించిన ప్రసిద్ధ నాథన్ హాట్​డాగ్​ తిండిపోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో జోయి జాస్ చెస్ట్​నెట్​ 71 వీఎనర్లు, రొట్టెలు తినేసి.. రికార్డు స్థాయిలో 12వ సారీ టైటిల్​ విజేతగా నిలిచాడు. మహిళా విభాగంలో మికీ సూడో మరోసారి విజేతగా నిలిచింది. 31 వీఎనర్లు, రొట్టెలు లాగించి, టైటిల్​ను ఎగరేసుకుపోయింది.

అయితే ఈ తిండిబోతు విజేతలు తమ గత రికార్డులను మాత్రం అధిగమించలేకపోయారు.
పురుషుల విభాగంలో 17 మంది ప్రత్యర్థులతో పోరాడి విజయం సాధించిన జోస్ జాయిస్ 2018లో 74 వీఎనర్లు, రొట్టెలు ఆబగా తినేసి, రికార్డు నెలకొల్పాడు. అయితే ఈసారి ఆ రికార్డుకు 3 బన్నుల దూరంలోనే నిలిచిపోయాడు.

"పోటీ చివరి 5 నిమిషాల్లో నెమ్మదిగా తినడం వల్లనే రికార్డు కోల్పోయాను. అయితే మరలా టైటిల్ నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది."
-జోస్, విజేత

ఈ పోటీల్లో జోస్ చిరకాల ప్రత్యర్థి, 2007 ట్రోఫీ విజేత తకేరు కోబయాషి ఈ పోటీల్లో పాల్గొనలేదు.
ఈ హాట్​డాగ్ తిండి పోటీలు 1972లో ప్రారంభమయ్యాయి. అయితే 1916లో ప్రారంభమైన నాథన్​ కంపెనీ ఈ పోటీలను అప్పటి నుంచే ప్రోత్సహిస్తోంది.

ఇదీ చూడండి:మాలీలో తెగల మధ్య పోరాటం.. 38 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details