తెలంగాణ

telangana

ETV Bharat / international

నలభై రెండేళ్ల నరకం తర్వాత స్వేచ్ఛ !

బయటకు రాకుండా ఒకే గదిలో ఓ వారం పాటు ఉండగలరా... నా వల్ల కాదు అంటారు కదూ... ఏ సరదా లేకుండా కచ్చితంగా ఓ నెలరోజులుండాలంటేనే జీవితం నిస్సారంగా అనిపిస్తుంటుంది కదా.  ఒక సంవత్సరం పాటు ఎవరో తెలియని ఓ అజ్ఞాతవాసిలా... రెండో తరగతి పౌరుడిలా ఉండాలంటే ఎలా అనిపిస్తుంది... బతకటం కంటే చావే నయం అంటారేమో కదా... మరి ఇదే జీవితం నలభై రెండేళ్ల పాటు జీవించి బయటపడితే ఏమని పిలవాలి... అచ్చంగా అది పునర్జన్మే. వాళ్లు జగజ్జేతలే!

By

Published : Mar 30, 2019, 5:02 AM IST

నలభై రెండేళ్ల నరకం తర్వాత స్వేచ్ఛ!

నలభై రెండేళ్ల నరకం తర్వాత స్వేచ్ఛ!
అమెరికా ఫ్లోరిడాకు చెందిన క్లిఫ్ విలియమ్స్, హూబర్ట్ నాథన్ మేయర్స్ అనే బాబాయి, అబ్బాయిలు అక్షరాలా 42 ఏళ్ల జైలుశిక్ష అనంతరం జనజీవన స్రవంతిలో కలిసి స్వేచ్ఛా వాయువులు పీల్చారు. ఆనంద బాష్పాలతో తమవారిని కలిశారు...కాలాన్ని పాదాక్రాంతం చేసుకున్నఈ సహనశీలురు.

"నాకు మరణశిక్ష విధించక ముందు మా అమ్మ మరణించింది. నేను అప్పుడు బయటికి వచ్చి నా పిల్లలతో ఉండాలనుకున్నాను. నా పిల్లలు తప్ప కుటుంబంలో అందరూ మరణించారు."-క్లిఫ్ఫర్డ్ విలియమ్స్

హత్య చేశారనే అభియోగంతో ఫ్లోరిడా పోలీసులు 1976 సంవత్సరంలో వీరిని అరెస్టు చేశారు. నైనా మార్షల్ అనే ఆమె తన సహచరుడు జేనెట్ విలియమ్స్​తో కలసి నిద్రిస్తుండగా విలియమ్స్, మేయర్స్ తమపై కాల్పులు జరిపారని వీరిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో జేనెట్ విలియమ్స్ అక్కడికక్కడే మృతి చెందారు. నైనా మార్షల్ గాయపడ్డారు. కాల్పులు జరిపింది తాము కాదని ఆ సమయంలో ఓ పుట్టిన రోజు వేడుకలో ఉన్నట్లు కోర్టులో వాదించారు ఈ ద్వయం. వారి తరఫున సాక్షులున్నప్పటికీ విధి వారిపై శీతకన్ను వేసింది. మాదక ద్రవ్యాల కేసులో చిక్కుకున్నారు. అప్పటికే హత్యారోపణలుండటం, మాదకద్రవ్యాల కేసులో చిక్కుకోవడం వల్ల కోర్టు జీవితకాలం పాటు జైలుశిక్షను విధించింది.

"స్వేచ్ఛను అనుభవిస్తున్న వ్యక్తుల్లో నేను ఒకడినయినందుకు సంతోషిస్తున్నా. నాకు జరిగిన దానికి బాధపడటం లేదు. కానీ దేవుడే నన్ను రక్షించి ఓ మనిషిని చేశాడనుకుంటున్నా."-నాథన్ మేయర్స్.

ఇంతకీ హత్య వారే చేశారని రుజువైందా అన్న అనుమానం కలుగుతోందా! బాధితురాలు మార్షల్​కు సమాజంలో ఉన్న పేరే విలియమ్స్ ద్వయానికి శిక్ష పడేలా చేసింది. కాల్పులు వీరే జరిపారన్న ఆధారాలేవీ లేకపోయినప్పటికీ మార్షల్ సాక్ష్యం ఆధారంగానే శిక్ష విధించారు.


ABOUT THE AUTHOR

...view details