ఈనెల 31న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పద్మశాలీమహాసభ జరగనుంది. కార్యక్రమానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నారు. హైదరాబాద్ రాజామహల్లోని పద్మశాలీభవన్లో సన్నాహక సమావేశం జరిగింది. చేనేత రంగంపై ఆదారపడి ఇరవై శాతం మంది మాత్రమే పనిచేస్తున్నారని మిగిలిన వారంతా పొట్టకూటి కోసం ఇతర రంగాల్లోస్థిరపడ్డారని మహాసభ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పద్మశాలీలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకుని బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయాలన్నారు. పద్మశాలీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర ఎకరాల భూమి, భవన నిర్మాణానికి నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
పద్మశాలి మహాసభకు హాజరుకానున్న కేటీఆర్
అఖిల భారత పద్మశాలి మహాసభ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి మహాసభ ఈనెల 31న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనుంది. ముఖ్యఅతిథిగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నారు.
హైదరాబాద్ రాజామహల్లోని పద్మశాలి భవన్లో సన్నాహక సమావేశం
TAGGED:
padmashali