తెలంగాణ

telangana

ETV Bharat / business

అత్యంత కనిష్ఠ స్థాయికి టోకు ద్రవ్యోల్బణం!

ఆహార పదార్థాలు, ఇంధన ధరలు తగ్గిన కారణంగా టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణనీయంగా దిగొచ్చింది. జులైలో అనేక సంవత్సరాల కనిష్ఠానికి తగ్గి 1.08 శాతానికి పరిమితమైంది.

By

Published : Aug 14, 2019, 1:31 PM IST

Updated : Sep 26, 2019, 11:42 PM IST

అత్యంత కనిష్ఠ స్థాయికి టోకు ద్రవ్యోల్బణం!

టోకు ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) మరింత దిగొచ్చింది. జులైలో 1.08 శాతానికే పరిమితమైంది. ఇంధనం, ఆహార పదార్థాల చౌక ధరలే ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణమని ప్రభుత్వ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చివరగా 2017 జులైలో టోకు ధరల సూచీ కనిష్ఠంగా 1.88 శాతంగా నమోదైంది. ఇప్పుడు మరింత తగ్గి... అనేక సంవత్సరాల కనిష్ఠస్థాయికి పడిపోయింది.

డబ్ల్యూపీఐ జూన్​లో 2.02 శాతంగా ఉండగా.. గతేడాది జులైలో రికార్డు స్థాయిలో 5.27 శాతం నమోదైంది.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్​లో 6.98 శాతంగా ఉండగా.. జులై నాటికి 6.15 శాతానికి పరిమితమైంది. ఇంధనం-విద్యుత్‌ విభాగ ద్రవ్యోల్బణం 3.64 శాతంగా నమోదైంది. జూన్​లో ఇది 2.2 శాతంగా ఉంది.

రిటైల్​ ద్రవ్యోల్బణం కూడా...

2019 జులైలో చిల్లర ధరల ఆధారిత సూచీ (సీపీఐ) 3.15 శాతానికి తగ్గింది. జూన్​లో చిల్లర ద్రవ్యోల్బణం 3.18 శాతంగా ఉంది.

ఇదీ చూడండి:తగ్గిన రిటైల్​ ద్రవ్యోల్బణం.. జులైలో 3.15 శాతం

Last Updated : Sep 26, 2019, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details