తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫలితాలపై ఆశలు- మార్కెట్లకు స్వల్ప లాభాలు

స్టాక్​ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 92 పాయింట్లు బలపడి.. తిరిగి 39 వేల మార్కును అందుకుంది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగింది.

By

Published : May 22, 2019, 9:44 AM IST

Updated : May 22, 2019, 10:17 AM IST

స్టాక్​ మార్కెట్లు

రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 92 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 39,061 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 11,720 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

లాభానష్టాల్లో ఉన్నవి..

ఓఎన్​జీసీ, ఇన్ఫోసిస్​, రిలయన్స్​, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్ బ్యాంకు, ఐటీసీ, హెచ్​యూఎల్​, ఐటీసీ, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

నేటి సెషన్ ప్రారంభంలో రూపాయి 4 పైసలు పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 69.67 వద్ద ట్రేడవుతోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.51 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 71.81 వద్ద కొనసాగుతోంది.

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నేడు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.

Last Updated : May 22, 2019, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details