తెలంగాణ

telangana

ETV Bharat / business

డిసెంబర్​ నుంచి 24x7 నెఫ్ట్ లావాదేవీలు

ఈ ఏడాది డిసెంబర్​ నుంచి 24x7 నెఫ్ట్ లావాదేవీలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

By

Published : Aug 7, 2019, 6:12 PM IST

24x7 నెఫ్ట్​ లావాదేవీలు

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్​ నుంచి 24 గంటలు నెఫ్ట్​ ద్వారా లావాదేవీలకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విధానం అమలైతే రిటైల్ లావాదేవీల్లో ఇదో విప్లవంగా మారుతుందని రిజర్వు బ్యాంకు భావిస్తోంది.

జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్​ఫర్​ (నెఫ్ట్).. ప్రస్తుతం పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నెలలో రెండు, నాలుగో శనివారాలు నెఫ్ట్​కు సెలవు దినాలు.

"డిజిటల్ లావాదేవీల ధ్యేయం 2021"లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు డిసెంబర్​ నుంచి 24x7 ప్రాతిపాదికన నెఫ్ట్ సేవలు అందుబాటులోకి తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జూన్​ నుంచి నెఫ్ట్, ఆర్​టీజీస్ చార్జీలను రద్దు చేసింది ఆర్బీఐ. వాటిని వినియోగదారులకు అందించాలని బ్యాంకులకు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ఏడాది కనిష్ఠానికి ఎస్​బీఐ వడ్డీ రేట్లు

ABOUT THE AUTHOR

...view details