తెలంగాణ

telangana

ETV Bharat / business

రికార్డు స్థాయిలో క్షీణించిన వాహనాల అమ్మకాలు

ప్రయాణికుల వాహనాల అమ్మకాలు ఏప్రిల్​ నెలలో 17 శాతం మేర  క్షీణించాయి. 2011 అక్టోబరు తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు క్షీణించడం ఇదే తొలిసారి.

By

Published : May 13, 2019, 11:52 PM IST

రికార్డు స్థాయిలో క్షీణించిన వాహనాల అమ్మకాలు

దేశంలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు ఏప్రిల్‌లో 17 శాతం మేర క్షీణించాయి. 2011 అక్టోబరు తర్వాత ఈ స్థాయిలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు క్షీణించడం ఇదే తొలిసారి. ద్రవ్య లభ్యత తగ్గడం, ఎన్నికల వేళ అనిశ్చితి, అధిక ధరలు అమ్మకాలను ప్రభావితం చేసినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం 'సియామ్‌' అంచనా వేసింది. వరుసగా ఆరో నెలలోనూ దేశీయంగా ప్రయాణికుల వాహనాల అమ్మకాలు క్షీణించినట్లు తెలిపింది సియామ్​.

2,47,541 యూనిట్లు మాత్రమే గత నెలలో అమ్ముడైనట్లు వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ సంఖ్య 2,98,504 యూనిట్లుగా ఉంది. గత నెలలో కార్ల విక్రయాలు 19.87 శాతం మేర క్షీణించినట్లు తెలిపింది సియామ్‌. ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 16.36 శాతం తగ్గుదల నమోదైనట్లు వెల్లడించింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా గత నెలలో 5.98 శాతం తగ్గినట్లు పేర్కొంది. గత పదేళ్లలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని సియామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుగతో సేన్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details