ఆన్లైన్ షాపింగ్(Online shopping) అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. ఎలక్ట్రానిక్స్ మొదలుకొని నిత్యావసర సరుకుల వరకు ఈ-కామర్స్(e-commerce) మీదనే చాలా మంది ఆధారపడుతున్నారు. కరోనా వల్ల కూడా ఈ-కామర్స్ సైట్ల వినియోగం పెరిగింది.
ఈ-కామర్స్ సైట్లలో షాపింగ్ సందర్భంలోనూ కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. వాటి గురించి తెలుసుకుందాం..
పోల్చి చూసుకోవటం
ప్రస్తుతం చాలా ఈ-కామర్స్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక దానిలోని ధరతో ఇంకో దానిలోని ధరకు తేడా ఉండవచ్చు. వీటన్నింటిని పోల్చి చూసుకోవటం ద్వారా తక్కువ ధరకు పొందవచ్చు. ఇందుకోసం ఒక్కో సైట్‌కు వెళ్లి ధరలను చూడాల్సిన అవసరం కూడా లేదు.
ఎందుకంటే.. ధరలను పోల్చి చూసుకునేందుకు కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా ఒక వస్తువు వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న ధరలను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. మై స్మార్ట్ ప్రైస్, ఫోన్ కర్రీ లాంటివి వీటికి ఉత్తమ ఉదాహరణలు.
కూపన్స్
కొన్ని షాపింగ్ సైట్లు కూపన్లను తీసుకుంటాయి. కూపన్స్ ద్వారా డిస్కౌంట్ లభిస్తుంది. కూపన్ దునియా, కూపన్ రాజా తదితర సైట్లు ఈ-కామర్స్ పోర్టళ్ల కూపన్లను అందిస్తుంటాయి. బ్రౌజర్ యాడ్ ఆన్స్, ఎక్స్టెన్షన్ల ద్వారా కూడా సులభంగా కూపన్లను పొందవచ్చు. ఈ యాడ్ ఆన్లు... ఈ-కామర్స్ సైట్లో ప్రాడక్ట్ పేజీలోకి వెళ్లగానే దానికి సంబంధించిన కూపన్ ఉంటే మనకు తెలియజేస్తుంది
క్యాష్‌బ్యాక్ సైట్లు
కూపన్లు డిస్కౌంట్లు ఇస్తే క్యాష్‌బ్యాక్ సైట్లు కొంత మొత్తాన్ని తిరిగి మనకే అందిస్తాయి. ఈ క్యాష్‌బ్యాక్ వెబ్సైట్లో పలు రకాల ఈ-కామర్స్ సైట్లకు సంబంధించిన క్యాష్‌బ్యాక్ వివరాలు ఉంటాయి. ఈ సైట్ల ద్వారా 3 శాతం వరకు పొదుపు చేసుకోవచ్చు.
ఉదాహరణ: క్యాష్‌కరో
ధరల అలర్ట్స్
బై హట్కే లాంటి ఎక్స్టెన్షన్ ద్వారా కూపన్లు, ఆఫర్లు తెలుసుకోవటమే కాకుండా ధర తగ్గినప్పుడు మెయిల్ ద్వారా అలర్ట్స్‌ను కూడా పంపిస్తుంది. ధర తగ్గే అవకాశాలను కూడా తెలియజేస్తుంది. వేరే సైట్లలో తక్కువ ధర ఉంటే దానికి సంబంధించిన వివరాలను కూడా ఈ ఎక్స్ టెన్షన్ తెలియజేస్తుంది. దీనివల్ల తక్కువ ధర ఇస్తున్న సైట్ల నుంచి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు.
పండుగల సమయంలో భారీ ఆఫర్లు..