తెలంగాణ

telangana

ETV Bharat / business

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​కు సెబీ భారీ జరిమానా

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​కు కోటి రూపాయల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ. ఈ మొత్తాన్ని 45రోజుల్లో కట్టాలని ఆదేశించింది. స్టాక్​ బ్రోకర్​ 'బీఆర్​హెచ్​ వెల్త్​క్రియేటర్స్​'కు సంబంధించిన కేసులో సెబీ నిర్ణయం తీసుకుంది.

By

Published : Jan 21, 2021, 9:45 PM IST

Updated : Jan 22, 2021, 8:24 AM IST

Sebi slaps Rs 1 cr fine on HDFC Bank in BRH Wealth Kreators case
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​కు సెబీ భారీ జరిమాన

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​పై కొరడా ఝుళిపించింది. ప్రముఖ స్టాక్​ బ్రోకర్​ 'బీఆర్​హెచ్​ వెల్త్​క్రియేటర్స్​'కి సంబంధించిన కేసులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్​కు రూ . కోటి జరిమానా విధించింది.

రెగ్యులేటర్ మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ గతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. బీఆర్​హెచ్​ వెల్త్​క్రియేటర్స్​కు సెక్యూరిటీలు విక్రయించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ.. ఈ కేసుపై తుది నిర్ణయం వచ్చే వరకు రూ.158.68 కోట్లను 'ఎస్​క్రో' ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తంపై ఏడు శాతం వడ్డీని కూడా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది.

సెక్యూరిటీ మార్కెట్​లో ఎలాంటి కార్యకలాపాలు సాగించవద్దని.. 2019 అక్టోబర్ 7న బీఆర్​హెచ్​ వెల్త్​క్రియేటర్స్, ఇతర సంస్థలకు సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిని లెక్క చేయకుండా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లావాదేవీలు జరిపినట్లు సెబీ గుర్తించింది. ఈ కారణంగా తక్షణ చర్యలకు ఉపక్రమించినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం వెల్లడించిన తీర్పు అంతిమం కాదని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో పూర్తి విచారణ జరిగే వరకు బీఆర్​హెచ్​ ఆస్తులను అటాచ్​ చేస్తున్నట్లు తెలిపింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు సంబంధించి సెబీ రాజీ పడబోదని స్పష్టం చేసింది. 45 రోజుల్లో ఫైన్​ను కట్టాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: రిలయన్స్‌, అంబానీలకు సెబీ జరిమానా

Last Updated : Jan 22, 2021, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details