ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏజీఆర్​ బకాయిలను మళ్లీ లెక్కిస్తున్న టెలికాం శాఖ! - వాణిజ్య వార్తలు తెలుగు

టెలికాం సంస్థలు చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిల విలువను మళ్లీ లెక్కించే పనిలో ఉంది టెలికాం విభాగం. టెల్కోలు చెబుతున్నదానికి.. తేలిన బకాయిల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు పునఃపరిశీలన చేస్తున్నట్లు సమాచారం.

TELECOM
టెలికాం
author img

By

Published : Feb 20, 2020, 6:22 PM IST

Updated : Mar 1, 2020, 11:41 PM IST

టెల్కోల ఏజీఆర్​ బకాయిలను ప్రభుత్వం మరోసారి లెక్కించనున్నట్లు సమాచారం. వివిధ సర్కిల్‌ కార్యాలయాలు అనుసరించిన అకౌంటింగ్‌ విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు టెలికాం సంస్థలు ఆరోపించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే కొన్ని సంస్థలు పూర్తిగా బకాయిలను చెల్లించామని ప్రకటించినట్లు తెలిపాయి అధికారవర్గాలు. అలా ప్రకటించిన సంస్థల నుంచే లెక్కింపు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ పునఃపరిశీలన ద్వారా టెల్కోలు చెబుతున్నదానికి.. ఏజీఆర్​ బకాయిల మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తించనుంది.

మార్చి 17లోపు పూర్తి..

అయితే సుప్రీం కోర్టు తదుపరి విచారణ మార్చి 17న ఉన్న నేపథ్యంలో.. ఆ లోపు చివరిసారిగా లెక్కింపు పూర్తి చేయనుంది టెలికాం శాఖ. ఏజీఆర్‌ బకాయిలెంతో మళ్లీ లెక్కించాలంటూ, మార్గదర్శకాలతో కూడిన ఓ లేఖను అన్ని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అకౌంట్స్‌ (సీసీఏ) కార్యాలయాలకు ఫిబ్రవరి 3న డాట్‌లోని లైసెన్సు ఫైనాన్స్‌ విభాగం పంపింది.

చెల్లింపుల్లో మినహాయింపులకు సంబంధించి దస్త్రాలు, వినతుల సమర్పణకు టెలికాం ఆపరేటర్లకు 15 రోజులు సమయం ఇవ్వాలని ఆ లేఖలో సీసీఏలకు సూచించింది.

టెలికాం మంత్రితో మిత్తల్ భేటీ..

టెలికాం శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​తో భారతి ఎయిర్​టెల్ ఛైర్మన్​ సునీల్ మిత్తల్ ఇవాళ భేటీ అయ్యారు. టెలికాం రంగంలో పన్నులు భారీగా ఉన్నాయన్న మిత్తల్​.. వాటిని వీలైనంత తగ్గించాలని కేంద్ర మంత్రిని కోరారు. టెలికాం రంగంలో ఏజీఆర్​ అనుకోని విపత్తు అని మిత్తల్ పేర్కొన్నారు. ప్రభుత్వమే దీనికి పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు.

Last Updated : Mar 1, 2020, 11:41 PM IST

ABOUT THE AUTHOR

...view details