తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈపీఎఫ్​ వడ్డీ పాక్షిక చెల్లింపులకు బోర్డ్​ ఓకే

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్​పై 8.5శాతం వడ్డీలో కొంత భాగాన్ని చెల్లించనున్నట్టు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ప్రకటించింది. తొలుత 8.15శాతం వడ్డీని జమ చెసి.. మిగిలినది డిసెంబర్​లో చెల్లిస్తామని వెల్లడించింది.

By

Published : Sep 9, 2020, 6:12 PM IST

'EPFO decides to credit part of 8.5pc interest for FY20'
8.5శాతం వడ్డీ చెల్లించేందుకు ఈపీఎఫ్​ఓ నిర్ణయం

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్​పై 8.5శాతం వడ్డీలో కొంత భాగాన్ని చెల్లించాలని నిర్ణయించింది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్​ఓ). తొలుత 8.15శాతం వడ్డీని జమ చేయనుంది. మిగతా 0.35శాతం వడ్డీని డిసెంబర్‌లో చెల్లిస్తామని తెలిపింది. దాదాపు 6కోట్ల మంది ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుందని వివరించింది.

ఉద్యోగులకు 8.5శాతం వడ్డీని అందిస్తామని ఈపీఎఫ్‌ఓ మార్చి నెలలోనే ప్రకటించింది. ఇప్పుడు అందులో కొంత భాగం చెల్లించేందుకు ట్రస్టీల బోర్డు ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి:-జూన్​లో 6.55 లక్షల కొత్త ఉద్యోగాలు

ABOUT THE AUTHOR

...view details