తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు - సుప్రీం న్యాయమూర్తుల నియామకం

సుప్రీం కోర్టుకు కొత్తగా ముగ్గురు మహిళలు సహా మొత్తం 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీం కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఈమేరకు​ ఆమోదం తెలిపారు.

SC gets nine new judges
సుప్రీం కోర్టు

By

Published : Aug 26, 2021, 11:48 AM IST

సుప్రీం కోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం చేసిన సిఫార్సులకు.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు.

మహిళా న్యాయమూర్తులు

కొత్త న్యాయమూర్తుల్లో.. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా.., గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ఉన్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కొలీజియం జాబితాలో ఉన్నారు. వీరితోపాటు కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎంఎం సుందరేశ్‌, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం. త్రివేది, సీనియర్‌ అడ్వకేట్‌ పీఎస్​ నరసింహా ఉన్నారు.

అధికారిక ఉత్తర్వులు వెలువడితే.. సోమవారం నాటికి కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరి ప్రమాణంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరనుంది.

ఇదీ చూడండి:సుప్రీంకోర్టు కొలీజియం చొరవ- న్యాయవ్యవస్థలో నారీశక్తి

తొలి మహిళా సీజేఐగా ఆ న్యాయమూర్తికే అవకాశం?

ABOUT THE AUTHOR

...view details