తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాక్సర్​' మోదీపై రాహుల్​ 'రాజకీయ పంచ్​'

మోదీని బాక్సర్​తో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. దేశంలోని సమస్యలపై పోరాడమని రింగులోకి దింపితే.. గురువుకు, నమ్మిన ప్రజలకే పంచ్​ ఇచ్చారని ఆరోపించారు.

By

Published : May 6, 2019, 3:37 PM IST

'బాక్సర్​' మోదీపై రాహుల్​ 'రాజకీయ పంచ్​'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. నమ్ముకున్న వారిని నట్టేట ముంచేశారని ఎద్దేవా చేశారు. అవినీతి, నిరుద్యోగం, రైతుల సమస్యలపై పోరాటానికి ప్రజలు ఆయన్ని గొప్ప బాక్సర్​గా ఊహించుకుని రింగులో దింపితే... వారిపైనే దాడి చేశారని ఆరోపిచారు. అధికారంలోకి వచ్చిన మొదటి పని నోట్ల రద్దు, గబ్బర్​ సింగ్​ పన్నుతో చిన్న చిన్న దుకాణదారులపై దాడి చేశారని పేర్కొన్నారు.

హరియాణాలోని భివాని ప్రచార సభలో ప్రసంగించారు రాహుల్​ గాంధీ.

'బాక్సర్​' మోదీపై రాహుల్​ 'రాజకీయ పంచ్​'

"హరియాణా భివాని ప్రజలు బాక్సింగ్​లో ప్రపంచ ఛాంపియన్​షిప్​లోకి వెళ్లారు. భారత్​లో 56 అంగుళాల ఛాతి కలిగిన బాక్సర్​ నరేంద్ర మోదీ రింగ్​లోకి దిగారు. దేశ ప్రజలు, మోదీ గురువు అడ్వాణీ, ఆయన జట్టు సభ్యులు గడ్కరీ ఇతరులు రింగ్​ వద్ద నిలబడ్డారు. దేశంలోని నిరుద్యోగం, రైతుల సమస్యలు, అవినీతిపై పోరాడాలని చెప్పారు. రింగులోకి ఎంతో ధూంధాంతో వచ్చిన బాక్సర్​ మొట్టమొదటిగా చేసింది అడ్వాణీని పంచ్​ చేయడమే. అడ్వాణీ మౌనంగా ఉండిపోయారు. మోదీ ఆ తర్వాత గడ్కరీ, అరుణ్ ​జైట్లీని ఒక్కొక్కరిగా కుమ్మేశారు. అది చూసిన ప్రజలు బాక్సర్​ ఏం చేస్తున్నారా అని ఆశ్చర్యానికి గురయ్యారు. రింగు నుంచి బాక్సర్​ బయటకు వచ్చారు. ఆయన్ను రింగులోకి పంపించింది దేనికి.. ఆయన చేస్తుంది ఏంటి అని జనం తలలు పట్టుకున్నారు. బాక్సర్​ జనంలోకి వచ్చి చిరు వ్యాపారులకు పంచ్​ ఇచ్చారు. మొదటిది... నోట్ల రద్దు, రెండోది గబ్బర్​ సింగ్​ పన్ను. రైతులనూ వదల్లేదు. రుణమాఫీ, గిట్టుబాటు ధర కోరితే రైతులకూ పంచ్​ ఇచ్చారు. ప్రజలు నిర్ఘాంతపోయారు. అసలు రింగ్​లోకి ఎందుకు దింపారో బాక్సర్​కు అర్థం కావడంలేదని అనుకుంటున్నారు."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు.

ABOUT THE AUTHOR

...view details