తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ ప్రధానితో మోదీ భేటీ లేదు: విదేశాంగ శాఖ

షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్​ సదస్సు​లో భాగంగా పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​, భారత ప్రధాని మోదీ మధ్య ఎలాంటి భేటీ లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 13,14 తేదీల్లో కిర్గిజిస్థాన్​లో జరగబోయే సమావేశానికి మోదీ హాజరుకానున్నారు.

By

Published : Jun 6, 2019, 6:17 PM IST

పాక్​ ప్రధానితో మోదీ భేటీ రద్దు: విదేశాంగ శాఖ

షాంఘై కో ఆపరేషన్​ ఆర్గనైజేషన్​ సదస్సు​లో భాగంగా పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య ఎలాంటి భేటీ లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ప్రణాళికలో లేవని పేర్కొంది.

కిర్గిజిస్థాన్​ రాజధాని బిష్కేక్​లో ఈ నెల 13, 14 తేదీల్లో జరగబోయే ఎస్​సీఓ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇరుదేశాల ప్రధానుల మధ్య సమావేశం ఉండనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ సమాధానమిచ్చారు.

పాక్​ ప్రధానితో మోదీ భేటీ రద్దు: విదేశాంగ శాఖ

" కిర్గిజిస్థాన్​లో పాకిస్థాన్​ విదేశాంగ శాఖ కార్యదర్శి పర్యటన వ్యక్తిగతం. భారత్​కు చెందిన ఏ ఒక్క అధికారితో సమావేశానికి ప్రణాళిక లేదు. నాకు తెలిసినంత వరకు షాంఘై కోఆపరేషన్​ సమ్మిట్​లో భాగంగా పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​​ ఖాన్​, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశం లేదు."
-రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి.

ఇదీ చూడండి:భాజపాలో 'నెం-2' అమిత్​ షా యేనా?

ABOUT THE AUTHOR

...view details