తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నెలనెలా ఖాతాలో డబ్బులేస్తారట!

నెలనెలా ఖాతాలో డబ్బులు! అది కూడా ఏ ఉద్యోగం చేయకుండానే! కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వదిలిన బ్రహ్మాస్త్రం ఇది. ఎలా సాధ్యం? ఎక్కడైనా అమల్లో ఉందా? నెలకు ఎంత ఇస్తారు? ఎవరెవరికి ఇస్తారు?

By

Published : Mar 15, 2019, 12:37 PM IST

నెలనెలా ఖాతాలో డబ్బులేస్తారట!

నెలనెలా ఖాతాలో డబ్బులేస్తారట!

కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తాం. ప్రభుత్వం కనీస ఆదాయ స్థాయిని నిర్ణయిస్తుంది. ఈ స్థాయికి దిగువన ఉన్న వారందరి ఖాతాలో ఆ డబ్బులు జమ చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరూ కనీస ఆదాయ స్థాయికి చేరుకుంటారు. - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

కనీస ఆదాయ పథకం...! సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్​ వాగ్దానం. వరుస పరాజయాలు చవిచూసిన తమను విజయ తీరాలకు చేర్చేందుకు ఈ హామీనే కీలకమన్నది ఆ పార్టీ నమ్మకం. అసలెందుకీ పథకం?

భారత్​ సహా అభివృద్ధి చెందిన, పారిశ్రామిక దేశాల్లో ఆర్థిక వృద్ధికి తగ్గట్లు ఉద్యోగ కల్పన జరగట్లేదు. అభివృద్ధి జరుగుతున్నా ప్రజలకు ఉద్యోగాలు రావట్లేదు. కాబట్టి వారికి ఆదాయం ఉండట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటన్న దానికి జవాబు సార్వత్రిక ఆదాయ పథకం. దేశంలోని ప్రతి పౌరుడికి కొంత ఆదాయాన్ని ప్రభుత్వం సార్వత్రికంగా అందిస్తుంది. వీరికి మాత్రమే ఇవ్వాలన్న నిబంధన నిబంధనలు లేకుండా ప్రతి పౌరుడికి కనీస ఆదాయం లభిస్తుంది.
-ఆచార్య అమిత్​ బసోలే, అజీమ్ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం-బెంగళూరు

ఇదీ చూడండి :సార్వత్రికం కోసం నారీభేరీ...!

పౌరులందరికీ కనీస ఆదాయమా? భారత్​లాంటి పెద్ద దేశాల్లో సాధ్యమేనా?

వ్యయం ఎక్కువవుతున్న దృష్ట్యా వాస్తవ సార్వత్రిక కనీన ఆదాయానికి భారత్​ సిద్ధంగా లేదు. దేశంలో ఎక్కువ మంది నిపుణులు ప్రతిపాదించిన వాటిలో కొన్ని వర్గాల వారు భాగం కారు. ఉదాహరణకు అరవింద్​ సుబ్రమణ్యం ఇటీవల ప్రతిపాదించిన 'సార్వత్రిక గ్రామీణ కనీస ఆదాయం' పరిధిలోకి 75% గ్రామీణ ప్రజలు వస్తారు. ఇది ప్రభుత్వ వ్యయంపరంగా కూడా ఆమోదయోగ్యం.
-ఆచార్య అమిత్​ బసోలే, అజీమ్ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం-బెంగళూరు

కనీస ఆదాయం అంటే ఎంత? ప్రజలకు ప్రభుత్వం ఎంత ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తారు?

దీనికి కచ్చితమైన ప్రామాణికత లేదు. దేశదేశాలకు ఇది మారుతుంది. ఈ పథకంలో అందించేది చాలా తక్కువ. ప్రజలు ఉద్యోగం చేస్తే సంపాదించినంత పొందరు. ప్రతిపాదించిన మొత్తాన్ని గమనిస్తే ఇదే స్పష్టమవుతుంది. అరవింద్​ సుబ్రమణ్యం ప్రతిపాదించిన దానిలో మొత్తం ఏడాదికి రూ. 18వేలు. ప్రభుత్వం ఇటీవల బడ్జెట్​లో ప్రకటించిన రైతు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఇచ్చేది ఏడాదికి రూ. 6వేలే. ఈ పథకానికి ఆధారమైన తెలంగాణ రైతుబంధు పథకంలో లబ్ధిదారులకు అందించే మొత్తం జాతీయ పథకం కంటే కొంచెం ఎక్కువున్నప్పటకీ... మరీ ఎక్కువేమీ కాదు. ఈ పథకంలో ఇచ్చేది సాధారణంగా తక్కువ ఉంటుంది. దీన్ని గణించటానికి శాస్త్రీయ పద్ధతులు లేవు. సమాజంలోని పేదవారి కొనుగోలు శక్తిని పెంచేలా ఈ మొత్తం ఉండాలి.
-ఆచార్య అమిత్​ బసోలే, అజీమ్ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం-బెంగళూరు

ఇదీ చూడండి :దంగల్​ 2019: జాగ్వర్​ X​ జట్కా

కనీస ఆదాయ పథకం ఎక్కడైనా అమల్లో ఉందా? ఉంటే... అక్కడ ప్రజలకు నెలకు ఎంత ఇస్తారు?

చాలా దేశాల్లో ప్రకటించారు. ప్రభుత్వ విధాన చర్చల్లో భాగమైంది. సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని కోరుకుంటున్నారా? లేదా? అనేదానిపై స్విట్జర్లాండ్​లో ప్రజాభిప్రాయసేకరణ చేశారు. దాన్ని ప్రజలు తిరస్కరించారు. ఈ పథకం ప్రజలు కోరుకునేది కాదు. ఇది చాలా దేశాల్లో వస్తున్నప్పటికీ, నా ప్రకారం... ఇది రాజకీయ వర్గాలు అమలుచేస్తున్న ఆలోచన. ఉద్యోగాలు కల్పించలేనందుకు వారు ఇస్తున్న పరిహారం లాంటిది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్​ కాదు. భారత్​లోనూ ఇంతే. మద్దతు ధర కోసం నిరసనకు దిగన రైతులు... ఇలాంటి డిమాండ్​ చేయలేదు. వారు మంచి ధరలు, ఉద్యోగాలు, వేతనాలు కోరుకుంటున్నారు.
-ఆచార్య అమిత్​ బసోలే, అజీమ్ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం-బెంగళూరు

ఇదీ చూడండి :విజయం ఎరుగని విక్రమార్కుడు!

కనీస ఆదాయ పథకంలో అనుకూల, ప్రతికూల అంశాలేంటి?

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా నగదు బదిలీ చేస్తుంది. మధ్యవర్తులు ఉండరు. అవినీతికి తక్కువ అవకాశాలుంటాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రతికూల అంశం. ప్రజలకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా, బ్యాంకు దూరంగా ఉన్నా.... పౌరులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మారుమూల ప్రాంతాల్లో అయితే ప్రజలు చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పథకం సరిగా అమలవ్వాలంటే అన్ని మౌలికసదుపాయాలు ఉండేలా చూసుకోవాలి. అదే అసలు సమస్య. ఒకవేళ ఇలాంటి సదుపాయాలు లేనట్లయితే పథకం విఫలమవుతుంది. ఈ పథకం వల్ల మరో నష్టం ఏమిటంటే... ఎలాంటి పని లేకుండా ఆదాయం ఇవ్వటం మాత్రమే ఉంటుంది. ఉచితంగా ఆదాయం పొందటానికి ప్రజలు అలవాటు అయ్యే అవకాశం ఉంది. అదే ఉద్యోగంలో అయితే పనికి తగ్గట్లే వేతనం అందుతుంది.
-ఆచార్య అమిత్​ బసోలే, అజీమ్ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం-బెంగళూరు

సార్వత్రిక ఆదాయ పథకానికి ప్రత్యామ్నాయం ఉందా?

ప్రభుత్వ విధానంలో సార్వత్రిక కనీస ఆదాయ పథకం ఉండొచ్చు. దీన్ని నేను తిరస్కరించను. మనకున్న సమస్యలను పరిష్కరించటానికి ఇదొక్కటే సరిపోదు. సార్వత్రిక ఆదాయంతో పాటు ఉపాధి కల్పన జరగాలి. సరిపడా ఉద్యోగాల సృష్టే ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి. అయినా ఇంకెవరైనా నిరుద్యోగులుగా మిగిలి ఉంటే... కనీస ఆదాయం అందించాలి. కనీస జీవన ప్రమాణాన్ని వారికి అందించాలి. అదే సమయంలో ఉద్యోగాల సృష్టికి సరిపడా కృషి చేయాలి.
-ఆచార్య అమిత్​ బసోలే, అజీమ్ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం-బెంగళూరు

ఇదీ చూడండి :మిత్రులే ప్రత్యర్థులైతే...!

ABOUT THE AUTHOR

...view details