తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్విస్​ ఖాతాల్లో తగ్గిన భారత సొమ్ము

స్విస్​ బ్యాంకుల్లో... పౌరులు, సంస్థలు దాచుకున్న డబ్బు నిల్వలు పడిపోయాయి. తాజా నివేదిక ప్రకారం భారత్​ 74వ స్థానంలో ఉంది. యూకే ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది.

By

Published : Jun 30, 2019, 4:45 PM IST

స్విస్​ ఖాతాల్లో తగ్గిన భారత సొమ్ము

భారత పౌరులు, సంస్థలు... స్విస్​ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు నిల్వలు తగ్గిపోయాయి. భారత్​ ఒక స్థానం దిగజారి 74వ ర్యాంకుకు చేరుకుంది. ఈ విషయంలో యూకే మరోమారు అగ్రస్థానాన్ని నిలుపుకుంది. స్విట్జర్లాండ్​ సెంట్రల్​ బ్యాంకింగ్ అథారిటీ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి.
రెండేళ్ల క్రితం 88వ స్థానంలో ఉన్న భారత్​... గతేడాదికి 15 స్థానాలు ఎగబాకి 73వ ర్యాంకుకు చేరుకుంది.

స్విస్​ నేషనల్ బ్యాంక్ (ఎస్​ఎన్​బీ) తాజాగా వార్షిక బ్యాంకింగ్ గణాంకాలు విడుదల చేసింది. ఈ గణాంకాలు... భారత పౌరులు, సంస్థలు... స్విస్​ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము చాలా తక్కువని చెబుతున్నాయి. స్విస్​ బ్యాంకుల్లో విదేశీ ఖాతాదారులందరూ దాచుకున్న నిధుల్లో ఇది కేవలం 0.07 శాతమని స్పష్టం చేస్తున్నాయి.

టాప్​-5 ఎవరంటే...

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న యూకే విషయానికి వస్తే... 26 శాతం నిధులు స్విస్​ బ్యాంకుల్లో ఉన్నాయి. యూకే తరువాత అమెరికా, వెస్ట్ఇండీస్​, ఫ్రాన్స్, హాంగ్​కాంగ్ టాప్-5 ర్యాంకుల్లో ఉన్నాయి.

స్విస్​ బ్యాంకుల్లో మూలుగుతున్న విదేశీ ఖాతాదారుల నిధుల్లో ఈ 5 దేశాల వాటా 50 శాతం కావడం విశేషం. టాప్​-10 దేశాలను తీసుకుంటే 2/3 వంతుల నిధులు ఆ దేశాలవే ఉంటాయి. టాప్​-15 దేశాలు తీసుకుంటే 75 శాతం నిధులు ఉంటాయి.

బ్రిక్స్​ దేశాల్లో...

స్విస్​ బ్యాంకుల్లో నిధులు దాచుకున్న బ్రిక్స్ దేశాల విషయానికొస్తే... 2018 సంవత్సరానికి రష్యా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్​ చివరి స్థానంలో నిలిచింది. రష్యా-20, చైనా-22, దక్షిణాఫ్రికా-60, బ్రెజిల్​-65వ ర్యాంకుల్లో ఉన్నాయి.

ఇరుగుపొరుగుతో పోల్చుకుంటే..

భారత్ పొరుగుదేశాలు మాత్రం మన కంటే ఈ విషయంలో వెనుకబడ్డాయి. పాకిస్థాన్​ -82, బంగ్లాదేశ్​-89, నేపాల్​-109, శ్రీలంక-141, మయన్మార్​ -187, భూటాన్-193 స్థానాల్లో ఉన్నాయి.

99 లక్షల కోట్లకు తగ్గింది..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీ ఖాతాదారులు స్విస్​ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము 2018 సంవత్సరానికి (4 శాతం) 99 లక్షల కోట్లకు పడిపోయింది. యూకే నుంచి 372 బిలియన్​ డాలర్లు స్విస్​ బ్యాంకుల్లో ఉంది. భారత్​ విషయానికి వస్తే 6 వేల 757 కోట్లు.. స్విస్​ బ్యాంకుల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: ట్రంప్​-కిమ్​ సాక్షిగా జవాన్లు, పాత్రికేయుల ఫైట్

ABOUT THE AUTHOR

...view details