తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతికి రాజీనామా సమర్పించారు. ఆమోదించిన కోవింద్​ నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ పదవిలో కొనసాగాలని మోదీని కోరారు​.

By

Published : May 24, 2019, 7:58 PM IST

Updated : May 24, 2019, 8:45 PM IST

ప్రధాని మోదీ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

ప్రధాని మోదీ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుత లోక్​సభ రద్దు తీర్మానంతో పాటు మంత్రివర్గం రాజీనామా లేఖలను మోదీ.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు అందజేశారు . మోదీ రాజీనామాను ఆమోదించిన కోవింద్ నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ప్రధానిగా కొనసాగాలని కోరారు. అందుకు అంగీకరించారు మోదీ.

దిల్లీలో ఈ రోజు సాయంత్రం జరిగిన సమావేశంలో మంత్రిమండలిని రద్దు చేసింది కేంద్ర కేబినెట్.

ఈనెల 30న ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. మంత్రివర్గంలోకి అమిత్​ షాను తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

2019 సార్వత్రికంలో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో భాజపానే సొంతంగా 303 స్థానాలు గెల్చుకొని పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. మొత్తంగా ఎన్డీఏ 348 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. యూపీఏ 86 సీట్లకే పరిమితమైంది.

ఇదీ చూడండి: కోచింగ్​ సెంటర్​లో మంటలు.. 15 మంది విద్యార్థులు మృతి..

Last Updated : May 24, 2019, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details