తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీకి పరువునష్టం నోటీసులు పంపిన 'దీదీ' మేనల్లుడు

ప్రధాని నరేంద్ర మోదీకి పరువునష్టం నోటీసులు పంపారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్​ బెనర్జీ. ఈ నెల 15న జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ తనను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. 36 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

By

Published : May 18, 2019, 9:44 PM IST

Updated : May 19, 2019, 12:19 AM IST

మోదీకి పరువునష్టం నోటీసులు పంపిన 'దీదీ' మేనల్లుడు

మోదీకి నోటీసులు పంపిన మమతా బెనర్జీ మేనల్లుడు

సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. భాజపా,తృణమూల్​ కాంగ్రెస్​ మధ్య మాత్రం మాటల మంటలు చల్లారలేదు. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి పరువునష్టం నోటీసులు పంపారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులను ప్రధాని అధికారిక నివాసానికి, భాజపా ప్రధాన కార్యాలయానికి పంపారు.

డైమండ్ హార్బర్‌లో ఈనెల 15న జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ తనను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ అభిషేక్ బెనర్జీ తెలిపారు. డైమండ్‌ హార్బర్‌లో అభిషేక్‌ బెనర్జీ టీఎంసీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలతో తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారంటూ ప్రధాని మోదీకి పంపిన పరువు నష్టం నోటీసుల్లో బెనర్జీ పేర్కొన్నారు. 36 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని నోటీసులో తెలిపారు.

Last Updated : May 19, 2019, 12:19 AM IST

ABOUT THE AUTHOR

...view details