తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"దేశంలో మోగే బ్యాండ్​లన్నీ మావే!''

దేశవ్యాప్తంగా జరిగే వివాహాలు, శుభకార్యాలకు ఏర్పాటు చేసే బ్యాండ్​లన్నీ మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి చెందినవే ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఆకాంక్షించారు. ఛిద్వాఢాలో మ్యూజిక్​ బ్యాండ్​ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారు.

By

Published : Mar 10, 2019, 8:01 AM IST

"దేశంలో మోగే బ్యాండ్​లన్నీ మావే!"

దేశంలో నిత్యం ఎన్నో వివాహాలు, శుభకార్యాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాల్లో మ్యూజిక్​ బ్యాండులు తప్పనిసరి. పెళ్లికి హాజరయ్యే బంధుమిత్రులు బ్యాండు వారి జోరుకు చిందులేయక తప్పదు. అటువంటి బ్యాండులు వాయించే వారందరూ ఒక్క చోటు నుంచే వస్తే ఎలా ఉంటుంది?ఇటువంటి ఆలోచనే మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​కు తట్టింది.

ఇది నెరవేర్చేందుకు త్వరలో ఛిద్వాఢాలోమ్యూజిక్​ బ్యాండ్​ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా జరిగే వివాహాలు, శుభకార్యాలకు ఏర్పాటు చేసే బ్యాండులు రాష్ట్రం నుంచే వెళ్లాలని, అందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

"దేశంలో మోగే బ్యాండ్​లన్నీ మావే!"

"దేశంలో ఎన్నో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతాయి. అందరు ఎంతో ఉత్సాహంతో ఉంటారు. దేశవ్యాప్తంగా వీటిలో పాల్గొనే బ్యాండులన్నీ మధ్యప్రదేశ్​కు చెందినవే ఉండాలని నా కోరిక."

---- కమల్​నాథ్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి.

ABOUT THE AUTHOR

...view details