తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​లో జోరుగా సహాయక చర్యలు

ఉత్తరాఖండ్​లో ప్రకృతి సృష్టించిన బీభత్సంలో రెండో రోజూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాయుసేన, ఎన్​డీ​ఆర్ఎఫ్​​ బృందాలు.. గల్లంతైన వారికోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.

By

Published : Feb 8, 2021, 2:29 PM IST

JK: Students of a school in Jammu hold a special prayer for those affected by flash floods in Uttarakhand
ఉత్తరాఖండ్​ బాధితుల కోసం కశ్మీర్​ విద్యార్థుల ప్రార్థనలు

ఉత్తరాఖండ్​లోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి, ఆకస్మిక వరద పోటెత్తిన ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. వాయుసేన, ఐటీబీపీ, ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ కలిసి యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నాయి.

ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

ధౌలీగంగా నది ప్రవాహ ఉద్ధృతి తగ్గించడానికి ఇంజినీరింగ్​ టాస్క్​ఫోర్స్​తో సహా.. సైనిక సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు సమీపంలోని సొరంగ మార్గాలను క్లియర్​ చేస్తున్నారు.

ఇంజినీరింగ్​ టాస్క్​ఫోర్స్

చమోలీలోని తపోవన్​ ఆనకట్ట సమీపంలో సొరంగంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టింది ఎన్​డీఆర్​ఎఫ్​. అయితే.. మందాకిని నది ఉద్ధృత స్థాయిలో ప్రవహిస్తూ ఉండడం ఇబ్బందికరంగా మారింది.

డాగ్​ స్క్వాడ్​తో సహాయక చర్యలు
సహాయక చర్యలు చేపట్టిన ఎస్​డీఆర్​ఎఫ్​
తపోవన్​ సొరంగమార్గం వద్ద సహాయక చర్యలు
క్రేన్​ల సాయంతో సహాయక చర్యలు

అటు వరదల్లో గల్లంతైన బాధితుల కోసం కశ్మీర్​లోని ఓ పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారంతా క్షేమంగా తిరిగొచ్చి వాళ్ల కుటుంబీకులతో కలవాలనే ఫ్లకార్డులు చేత పట్టుకుని దేవుణ్ని వేడుకున్నారు చిన్నారులు.

కశ్మీర్​ విద్యార్థుల ప్రత్యేక ప్రార్థనలు

ఇదీ చదవండి:2013 వరదలా... అమ్మ బాబోయ్​

ABOUT THE AUTHOR

...view details