తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరస్పర సహకారంతోనే అవకాశాలు: మోదీ

కిర్గిస్థాన్​ రాజధాని బిష్కెక్​లో భారత్​-కిర్గిజ్​ వర్తక మండలి సదస్సును ఆ దేశ అధ్యక్షుడు సూర్న్​బే జీన్​బెకోవ్​తో కలిసి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిర్గిస్థాన్​కు 200 డాలర్ల రుణాన్ని ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ద్వంద్వ పన్నుల రహిత ఒప్పందానికి తుది రూపునిచ్చినట్లు చెప్పారు.

By

Published : Jun 15, 2019, 7:35 AM IST

Updated : Jun 15, 2019, 7:45 AM IST

'పరస్పర సహకారంతో అవకాశాలు అందిపుచ్చుకుందాం': మోదీ

'పరస్పర సహకారంతో అవకాశాలు అందిపుచ్చుకుందాం': మోదీ

భారత్​, కిర్గిస్థాన్​ వ్యాపార సంస్థలు వివిధ రంగాల్లో ఇప్పటి వరకు గుర్తించని అవకాశాలను వెలికితీయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిష్కెక్​లో భారత్-కిర్గిజ్​ వర్తక మండలి సదస్సును ఆ దేశ అధ్యక్షుడు సూర్న్​బే జీన్​బెకోవ్​తో కలిసి మోదీ ప్రారంభించారు.

ఈ సదస్సులో ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధి కోసం రెండు దేశాలు ఐదేళ్ల ప్రణాళికను రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ద్వంద్వ పన్నుల రహిత ఒప్పందానికి (డీటీఏఏ) తుది రూపునిచ్చినట్లు చెప్పారు.

పెట్టుబడులతో రండి..

జౌళీ, రైల్వేలు వంటి రంగాల్లో భారతీయ వ్యాపారులకు కిర్గిస్థాన్​ మంచి సహకారం అందిస్తోందని మోదీ ప్రశంసించారు. కిర్గిజ్​ వ్యాపారులూ భారత్​లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పెట్టుబడులతో రావాలని మోదీ ఆహ్వానించారు.

"వర్తకం, పెట్టుబడులను పెంచే విషయమై నా దృష్టిలో మూడు అంశాలు ఉన్నాయి. అవి అనుకూల వాతావరణం, అనుసంధానత, వ్యాపారంలో పరస్పర సహకారం. అనుకూల వాతావరణం కోసం ద్వంద్వ పన్నుల రహిత ఒప్పందానికి మేము తుది రూపునిచ్చాం. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపైనా నిర్మాణాత్మక రీతిలో చర్చలు జరుపుతున్నాం. దీని ద్వారా పెట్టుబడులకు మంచి ఊతం లభిస్తుంది. భారతీయ వ్యాపారులతో కలిసి పనిచేయాలని నేను కిర్గిస్థాన్​ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాను. కిర్గిస్థాన్​లో ఉన్న ప్రోత్సాహమే మీకు భారత్​లోనూ లభిస్తుంది." - నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

రూ.1400 కోట్ల రుణం..

కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూర్న్​బే జీన్​బెకోవ్​తో విస్తృత చర్చలు జరిపిన మోదీ, ఆ దేశానికి 200 మిలియన్​ డాలర్ల (రూ.1,400 కోట్లు) రుణాన్ని ప్రకటించారు. వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి ద్వంద్వ పన్నుల రద్దుతో సహా 15 ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు.

ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బీఐటీ), ఆరోగ్యం, భద్రత, రక్షణ, సమాచార, సాంకేతిక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించారు.

ఆర్థిక, భద్రతాకూటమి..

చైనా నేతృత్వంలోని 8 సభ్య దేశాల ఆర్థిక, భద్రతా కూటమే... 'షాంఘై సహకార సమాఖ్య (ఎస్ సీఓ)'. 2017లో భారత్​, పాకిస్థాన్​ ఈ కూటమిలో చేరాయి.

ఇదీ చూడండి: టార్గెట్​ దీదీ: 100 మందికి పైగా వైద్యుల రాజీనామా

Last Updated : Jun 15, 2019, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details