తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రఖ్యాత ఏనుగు పార్థన్​ మృతి- మావటి కన్నీరు

కేరళలోని పలు దేవాలయాల్లో సేవలందించే పార్థన్ అనే ఏనుగు మృతి చెందింది. పార్థన్ బాగోగులు చూసుకునే మావటి కన్నీరు పెట్టిన సన్నివేశం పలువురిని కంటతడి పెట్టించింది.

By

Published : May 8, 2019, 11:17 PM IST

ప్రఖ్యాత ఏనుగు పార్థన్​ మృతి- మావటి కన్నీరు

ప్రఖ్యాత ఏనుగు పార్థన్​ మృతి- మావటి కన్నీరు

కేరళలోని పలు దేవాలయాల్లో పండగైతే 'చెరుపుళ్లస్సెరి పార్థన్' అనే ఏనుగుదే ప్రధాన ఆకర్షణ. ఊరేగింపుల్లో చురుకుగా పాల్గొనేది. ఊరేగింపులో ఉత్సవ విగ్రహాన్ని రాజసంగా మోసేది అందరూ యువరాజుగా పిలిచే పార్థన్. శక్తి ఉన్నంతకాలం వల్లువనాడ్​ పరిసర ప్రాంతాల్లోని ఆలయల్లో సేవలే పార్థన్​కు పరమావధి.

44 ఏళ్ల నిండు వయస్సులో పార్థన్​ కన్నుమూసింది. ఈ ఏడాది త్రిశూర్​పురం ఆలయ ఉత్సవాల్లో కనిమంగళం శాస్త విగ్రహాన్ని పార్థన్ మోయాల్సి ఉంది. కానీ పార్థన్​ మృతితో అక్కడివారు బాధపడ్డారు.

గత నాలుగు నెలలుగా పార్థన్ అనారోగ్యంతో బాధపడుతోంది. పార్థన్​ను శబరి వ్యాపార సంస్థ వారు పెంచారు. శబరి సంస్థకు చెందిన ఏనుగుల క్యాంపులో పార్థన్​ మృతి చెందింది. ఏనుగు బాగోగులు చూసుకునే మావటి పార్థన్​ను పట్టుకుని ఏడ్చిన సన్నివేశం పలువురిని కంటతడి పెట్టించింది.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ కలిగించాయి'

ABOUT THE AUTHOR

...view details