తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పరువు' కేసులు: శశికి బెయిల్- కేజ్రీకి సమన్లు

రాజకీయ నాయకులకు సంబంధించిన వేర్వేరు పరువు నష్టం కేసులపై విచారణ చేపట్టింది దిల్లీ కోర్టు. మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్​ నాయకుడు శశిథరూర్​కు బెయిల్​ మంజూరు చేసింది. మరో కేసులో ఆప్​ నాయకులకు బెయిల్​ ఇచ్చినా... ఈనెల 16న విచారణకు హాజరుకావాలని దిల్లీ ముఖ్యమంత్రిని ఆదేశించింది.

By

Published : Jun 7, 2019, 2:32 PM IST

Updated : Jun 7, 2019, 9:04 PM IST

'పరువు' కేసులు: శశికి బెయిల్- కేజ్రీకి సమన్లు

'పరువు' కేసులు: శశికి బెయిల్- కేజ్రీకి సమన్లు

రాజకీయ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులపై విచారణ చేపట్టింది దిల్లీ కోర్టు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్​ నాయకుడు శశిథరూర్​కు బెయిల్​ మంజూరు చేసింది. రూ. 20 వేల పూచీకత్తుపై థరూర్​కు బెయిల్​ ఇచ్చింది.

థరూర్​ వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని భాజపా దిల్లీ నాయకుడు రాజీవ్​ బబ్బర్​ పిటిషన్​ దాఖలు చేశారు.

కేజ్రీవాల్​కు సమన్లు..

దిల్లీలోని ఓటర్ల జాబితాలో పేర్లు అక్రమంగా తొలగించారన్న వ్యాఖ్యలపై భాజపా దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ చేపట్టింది కోర్టు. ఆమ్​ ఆద్మీ పార్టీ నేతలు అతిశి, సుశీల్​ కుమార్​ గుప్తా, మనోజ్​ కుమార్​కు రూ. 10 వేల పూచీకత్తుతో బెయిల్​ ఇచ్చింది.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ విచారణకు హాజరు కాకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ఈ నెల 16న హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.

ఇదీ చూడండి:భానుడి భగభగలు- గణేశుడికీ చెమటలు!

Last Updated : Jun 7, 2019, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details