కాంగ్రెస్ ప్రధాన ప్రచార నినాదంగా ఉన్న 'చౌకీదార్ చోర్‌హై' పదబంధాన్ని సృష్టించింది తాను కాదని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆ నినాదానికి సృష్టికర్తలు రైతులు, యువతేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ భిండ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్.
"ఓ రోజు ఛత్తీస్‌గఢ్‌లో సభ నిర్వహిస్తుండగా ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు, 2కోట్ల ఉద్యోగాల కల్పన వంటి చౌకీదార్ ఇచ్చిన హామీలను ప్రస్తావించాను. అక్కడున్న రైతులు, యువత సమూహంలోని కొంత మంది 'చోర్ హై' అని గట్టిగా అరిచారు. అప్పటి నుంచే 'చౌకీదార్ చోర్ హై' నినాదం ప్రచారంలోకి వచ్చింది" అని వివరించారు రాహుల్.