అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఆగస్టు 5న భూమిపూజ నిర్వహించి ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. మందిరం నిర్మించే చోట 2,000 అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్‌ను భద్రపరచనున్నట్లు వెల్లడించింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. రామమందిరానికి సంబంధించిన చరిత్ర, వాస్తవాల పూర్తి వివరాలను ఇందులో పొందుపరచనున్నట్లు పేర్కొంది. దీని ద్వారా భవిష్యత్తులో మందిరానికి సంబంధించి ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉంటాయని ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు.
అయోధ్యలో 2వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే చోట 2వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్‌ను ఉంచనున్నట్లు తెలిపింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. భవిష్యత్తులో మందిరంపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేలా చరిత్ర, వాస్తవాలను టైమ్ క్యాప్యుల్‌లో భద్రపరచునన్నట్లు పేర్కొంది.
రామాలయ భూభాగంలో 2వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్
గతేడాది నవంబర్‌లో అయోధ్య భూవివాదం కేసులో చారిత్రక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అనంతరం దాదాపు 9నెలల తర్వాత రామమందిర నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం ఎర్పాట్లను ముమ్మరం చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు పంపింది.
ఇదీ చూడండి: ఇలాంటివి చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: రాహుల్