ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Pipeline damage in Hyderabad : పంపు పగిలి.. పాతాళగంగ పైకి వచ్చింది - మెహదీపట్నంలో పగిలిన పైపులైన్

By

Published : Jun 21, 2022, 1:27 PM IST

హైదరాబాద్​ మెహదీపట్నం వద్ద వాటర్‌​ పైప్​లైన్ పగిలింది. రాత్రి జరిగిన ఈ ఘటనతో భారీగా తాగునీటి వృధా అయింది. పీవీ ఎక్స్​ప్రెస్​ పిల్లర్ నంబర్ 186 వద్ద ఈ ఘటన జరిగింది. పెద్ద ఫౌంటెన్​ను తలపించేలా వస్తున్న నీరు రహదారిపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి కురిసిన వర్షానికి అప్పటికే రహదారులు జలమయమవ్వగా.. పైపులైన్ పగలడం ద్వారా వచ్చిన నీటితో రోడ్లు చెరువును తలపించాయి. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపివేయించి మరమ్మతులు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details