ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 28, 2019, 6:29 PM IST

ETV Bharat / videos

ఉర్రూతలూగించిన విశాఖ ఉత్సవ్ కార్నివాల్

సాగరతీరంలో విశాఖ ఉత్సవ్ 2019 ఘనంగా ప్రారంభమైంది. ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్నివాల్​.. నగరవాసులతో పాటు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ కార్నివాల్​లో స్థానిక కళాకారులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్న రథం వెనక ఈ కార్నివాల్ సాగింది. కళాకారులతో పాటు పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నేటి తరానికి తెలియని ఎన్నో సంప్రదాయ, జానపద నృత్యాలు కార్నివాల్​లో ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details