ఆకర్షణీయంగా...అపురూపంగా గణనాథులు - variety ganapati in ap
వినాయక చవితి వేడుకల్లో వెరైటీ గణనాథులు ఆకర్షిస్తున్నారు. నిర్వాహకులు పర్యావరణహిత సందేశమిస్తూ... విభిన్న రూపాలతో గణనాథులను తయారుచేశారు. వెరైటీ గణనాథులను వీక్షించేందుకు భక్తులను భారీగా మండపాలకు తరలి వస్తున్నారు. మట్టిగాజులు, కొబ్బరి చిప్పలు, చిరుధాన్యాలు, చెరుకుగడలు.. ఇలా రకరకాలుగా లంబోదరుడిని తీర్చిదిద్దారు.