Prathidwani: ఏపీలో ఈ స్థాయిలో విద్యుత్ సంక్షోభం ఎందుకొచ్చింది? - నేటి ప్రతిధ్వని
ఠారెత్తిస్తున్న ఎండల్లో వేళాపాళా లేని విద్యుత్ కోతలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వేసవి కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉన్న మాట వాస్తమే. కానీ మరీ ఈ స్థాయిలో సంక్షోభం చూస్తోంది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఎందుకింత కష్టం? ఏటా వేసవిలో ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసినా... ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ అధికారులు ఎక్కడ తడబడ్డారు? ఒకప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు.. ఏ రోజు విద్యుత్ కోసం ఆ రోజు కోసం స్పాట్ ఎక్సేంజీ మీద ఎందుకు ఆధారపడాల్సి వస్తోంది? సామాన్యుల నుంచి విద్యుత్ రంగం నిపుణుల వరకు అందర్నీ కొద్దిరోజులుగా వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.