Prathidwani: మహానగరాల్లో ఘోర అగ్నిప్రమాదాలు.. అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? - మహానగరాల్లో అగ్నిప్రమాదాలపై నేటి ప్రతిధ్వని
మహానగరాల్లో జరుగుతున్న ఘోర అగ్నిప్రమాదాల్లో ఏటా భారీ సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నగరాలు, పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్లో ఎక్కువగా తీవ్రస్థాయి అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. ఈ ప్రమాదాలకు కారణమవుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారా? భారీ ఎత్తున మంటలు వ్యాపించినప్పుడు సకాలంలో స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడటం ఎలా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.