Prathidhwani: రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా.. జీతాలు - జిల్లాల చుట్టే రాజకీయం ఎందుకు?
రాష్ట్రం మొత్తం ఇప్పుడు రెండు అంశాలు చుట్టే తిరుగుతోంది. ఒకవైపు డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు.. మరొకవైపు కొత్త జిల్లాల ప్రకటనపై అభ్యంతరాలతో ఆందోళన బాట పట్టిన వివిధ ప్రాంతాల ప్రజలు. అసంతృప్తి సెగలు, నిరసనల నినాదాలతో రాష్ట్రం ప్రతిధ్వనిస్తోంది. అసలు.. ఈ రెండు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆలోచనలు ఏమిటి? అవి ఎందుకింత వివాదాస్పదంగా మారాయి? విపక్షాలు, ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్న వారి ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా?. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా.. ఈ జీతాలు - జిల్లాల చుట్టే రాజకీయం ఎందుకింతగా రగులుకుంటోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..