Prathidhwani: దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. వారినీ వదలని "ఒమిక్రాన్"! - discussion on new corona variant
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచానికి గుబులు పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ పొరుగుదేశాలకూ పాకుతోంది. ఇజ్రాయిల్, బెల్జియం, హాంకాంగ్‌లోనూ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో తీవ్ర ఉత్పాతం సృష్టించిన డెల్టా వేరియంట్ కంటే.. ఒమిక్రాన్ తీవ్రమైనదని డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. దక్షిణాఫ్రికాతోపాటు ఒమిక్రాన్ ప్రభావిత దేశాలతో విమానాల రాకపోకలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కోరల్లో చిక్కకుండా తీసుకోవాల్సిన చర్యలేంటి ? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ "ప్రతిధ్వని" చర్చా కార్యక్రమం..