తిరుమల బ్రహ్మోత్సవాలు.. హంస వాహనంపై విహరించిన శ్రీవారు - హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమిచ్చిన శ్రీవారు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం స్వామివారు హంస వాహనంపై విహరించారు. వీణ ధరించి శ్రీసరస్వతీ అలంకారంలో హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.