వైభవంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవం.. - The grand finale is Srivari Teppotsavam
తిరుమలేశుని తెప్పోత్సవాలు ఐదు రోజులపాటు వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజున స్వామివారు శ్రీవారి ఆలయం నుంచి అమ్మవార్లతో కలసి తిరుచ్చి వాహనంపై తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు. కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆశీనులై ఏడుమార్లు ప్రదక్షిణగా విహరించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల సంకీర్తనల నడుమ... తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.
Last Updated : Mar 9, 2020, 11:50 PM IST
TAGGED:
Srivari Teppotsavam