మంచు కురిసే వేళలో.. మైమరిపించే కోనసీమ అందాలు! - భూతలస్వర్గం..కోనసీమ
ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కోనసీమ. ఇక్కడ లంక గ్రామాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో కనువిందు చేస్తాయి. దట్టమైన మంచు కురిసే సమయంలో కోనసీమలోని లంక గ్రామాలు కశ్మీర్ అందాలను తలపిస్తాయి. ప్రకృతి చెక్కిన శిల్పంలా.. స్వర్గసీమను తలపించే కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువే. దట్టమైన మంచు దుప్పటి కమ్మేసిన సమయంలో మనసును కట్టిపడేసే అందమైన దృశ్యాలు మనమూ చూద్దామా..!